*మాజీ సైనికుల భవనం కోసం స్థలం కేటాయించాలి…
*ప్రభుత్వానికి మాజీ సైనికులు విజ్ఞప్తి…
తిరుపతి(నేటి ధాత్రి:
తిరుపతి జిల్లాలో ఆర్మీ,నేవీ, ఎయిర్ఫోర్స్ కు చెందిన మాజీ సైనికులు వారి కుటుంబ సభ్యులతో కలిసి సుమారు 15200 మంది ఉన్నారని, ఇప్పటివరకు జిల్లాలో సైనికుల ఆరోగ్య కేంద్రం, సొంత భవనం కోసం సరైన స్థలం కేటాయించకపోవడం ఏంటి అని శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో తిరుపతి జిల్లా అధ్యక్షులు మనోహర్ రెడ్డి చెప్పారు.పది సంవత్సరాలగా ప్రజాప్రతినిధులు,అధికారుకువిన్నవించినప్పటికీ ఎలాంటి పరిష్కారం లభించలేదన్నారు.గత ప్రభుత్వంలో చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి కి అర్జీలు సమర్పించినప్పటికీ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానికి, సంక్రాంతి పండగ సందర్భంగా నారావారిపల్లి లో ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడుకి వినతి పత్రం అందజేశామని అన్నారు. కలెక్టర్ ద్వారా మంగళం రెవిన్యూ గ్రామంలో 90 సెంట్లు భూమిని కేటాయించబడిందని, ఆ భూమికి సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారి, మంగళం గ్రామపంచాయతీ నుండి తీర్మానం కోరగా తీర్మానం నెంబర్ 142 ద్వారా గ్రామపంచాయతీ తిరస్కరించడం జరిగిందని చెప్పారు.మాజీ సైనికుల మనోభావాలు దెబ్బతిని, వారి ధైర్యాన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. సమావేశంలో ఉపాధ్యక్షులు పి.ఆనంద రెడ్డి, ప్రధాన కార్యదర్శులు ఎస్. గోపాల్, ఎల్.లీలా కృష్ణ, కమిటీ సభ్యులు వి అమూల్ నాయుడు, జి జయప్రకాష్ రెడ్డి, ఆర్ రమేష్ నాయుడు, తదితరులు సమావేశంలో పాల్గొన్నారు…
