
నడి కూడ,నేటి ధాత్రి:
పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం హర్షనీయమని పార్టీ సీనియర్ నాయకులు జిల్లా ఓబీసీ కోఆర్డినేటర్ బొమ్మ చంద్రమౌళి,పార్టీ నాయకులు నారగాని కుమారస్వామి అన్నారు.వీరితో పాటు పార్టీ నాయకులు వాంకె రాజయ్య,ఎండిగ రాజేశ్వరరావు,అట్టెం బాబు, నారగాని ఐలయ్య, తాళ్ల నవీన్, తాళ్లపల్లి యుగేందర్,వనపర్తి నవీన్, పల్లె రామస్వామి పలువురు గ్రామ నాయకులు మంగళవారం పరకాల లోని మొలుగూరి ఇంటి వద్ద ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. మొలుగూరి బిక్షపతి కాంగ్రెస్ పార్టీలోకి రావడం కార్యకర్తల్లో ఉత్సాహం కలిగినట్లు అయిందని వారు హర్షాభావం వ్యక్తం చేశారు.