రాచన్న స్వామి జాతరకు సర్వం సిద్ధం
జహీరాబాద్:నేటి ధాత్రి
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం దేవాదాయ ధర్మాదాయ శాఖ అధీనంలో కొనసాగుతున్న బడంపేట రాచన్న స్వామి 3 రోజుల జాతర కోసం సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి విభూతి శివ రుద్రప్ప మంగళవారం ఉదయం తెలిపారు. మార్చి 4, 5, 6 మూడు రోజుల పాటు రాచన్న స్వామి జాతర మహోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్లు, ఇఓ శివరుద్రప్ప వివరించారు.