పల్స్ పోలియోకు సర్వం సిద్ధం

డిఎం హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్

భూపాలపల్లి నేటిధాత్రి

అప్పుడే పుట్టిన పాప నుంచి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య సంరక్షణ లక్ష్యంగా ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 3 న ఆదివారం జిల్లాలో పల్స్ పోలియో చుక్కల పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్యశాఖ అధికారులు అన్ని ఆరోగ్య కేంద్రాల్లో పోలియో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం ఐదేళ్ల లోపు పిల్లలు 34728 మంది ఉన్నారు ,14 పి హెచ్ సి లలో 296 (బ పోలియో చుక్కల పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేసినారు, మొబైల్ టీమ్స్ ను 14, ట్రాన్సిస్ట్ పాయింట్స్ ను 14 ఏర్పాటు చేయడం జరిగినది
ఈ మేరకు కార్యాచరణ సిద్ధం చేసినారు. ఈరోజు చుక్కలు వేయించుకొని వారికి మార్చి 4, 5వ తేదీల్లో వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ పోలియో చుక్కలు వేస్తారు అని డిఎం హెచ్ ఓ డాక్టర్ మధుసూదన్ ఒక ప్రకటనలో తెలియజేసినారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *