ఫిబ్రవరి 06 చివరి తేదీ.!
అచ్చునూరి కిషన్
తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ.
నేటిధాత్రి:హన్మకొండ
హన్మకొండ: రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 01- 2020 లోపు డిగ్రీ, బిటెక్ పూర్తి చేసిన ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని తీన్మార్ మల్లన్న టీమ్ రాష్ట్ర కమిటీ సభ్యుడు, ములుగు జిల్లా ఇంఛార్జీ అచ్చునూరి కిషన్ సంయుక్త ప్రకటన’లో తెలియజేశారు.
అలాగే గతంలో ఓటు నమోదు చేసుకున్న పట్టభద్రులు కూడా మళ్ళీ నమోదు చేసుకోవాలని, ఆన్లైన్ లో: https://ceotelangana.nic.in కానీ, ఆఫ్ లైన్ లో…. మీ పాస్ ఫోటో, డిగ్రీ సర్టిఫికెట్స్, ఓటరు కార్డు, ఆధార్ కార్డు జిరాక్స్ లు సమర్పించి పాత, కొత్త వారు విధిగా ఎమ్మెల్సీ ఓటు నమోదు చేసుకోవాలని, ములుగు జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్హులైన ప్రతి ఒక్క పట్టభద్రులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన గళాన్ని చట్టసభల్లో వినిపించే ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్న ను ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మేజార్టీ’తో గెలిపించి మన సమస్యల పరిష్కారాన్ని ప్రజా ప్రభుత్వం ద్వారా నెరవేర్చుకుందాం అని తెలియజేస్తున్నాను.