అర్హత గల ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలి.

# జిల్లా స్వీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి

నర్సంపేట,నేటిధాత్రి :

18 నిండి ఓటు హక్కుకు అర్హత గల ప్రతీ ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని జిల్లా స్వీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు. నర్సంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో జిల్లా స్వీట్ నోడల్ అధికారి స్థానిక ఆర్డిఓ ఉమారాణితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి పోలింగ్ బూత్ లలో బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని,18 సంవత్సరాలు పూర్తి అయిన యువతి యువకులు ఓటు నమోదు చేయుటకు క్యాంపస్ అంబాసిడర్లను ఏర్పాటు చేసి అధిక శాతం ఓటరు నమోదు చేసుకొనుటకు ఫారం 6 అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకోవాలని,అలాగే ఆన్లైన్ ద్వారా నమో చేసుకోవడానికి voters.eci.gov.in ద్వారా నమోదు చేసుకోవచ్చునని జిల్లా స్వీట్ నోడల్ అధికారి భాగ్యలక్ష్మి తెలిపారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట తాసిల్దార్ రాజేష్ ఎంపీడీవో శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *