
Everyone should work towards a corruption-free society.
అవినీతి రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
ఎన్ హెచ్ ఆర్ సి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపు
హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామకం

“నేటిధాత్రి”,హుజురాబాద్ (కరీంనగర్ జిల్లా): దేశంలో ప్రతి పౌరుడు తమ హక్కులను బాధ్యతలు తెలుసుకొని అవినీతి రహిత సమాజం కోసం కృషి చేయాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్ అధ్యక్షతన హుజురాబాద్ పట్టణంలో హుజురాబాద్, జమ్మికుంట, సైదాపూర్ మండల కమిటీల నియామక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది సుంకనపల్లి రాము, రాష్ట్ర కమిటీ సభ్యులు గుర్రాల సదన్న, రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్, పరకాల సమ్మయ్య గౌడ్, జిల్లా ఉపాధ్యక్షురాలు పులుగు లతారెడ్డి తదితరులు హాజరైన ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మాట్లాడుతూ రోజురోజుకు అవినీతి రాజ్యమేలుతుందని, దేశ సంపద, ప్రజాధనం అవినీతి అక్రమార్కుల చేతిలో దుర్వినియోగం అవుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బలమైన ప్రజా పోరాటాల ద్వారానే దేశాన్ని అవినీతిపరుల నుండి కాపాడుకోగలమని ఆయన అన్నారు. అవినీతి అక్రమార్కులను సమాజంలో దోషులుగా చూపించే కార్యచరణను జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రూపొందించిందని ఆయన పేర్కొన్నారు. అవినీతి రహిత సమాజం కోసం తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర కమిటీ సభ్యులు రావుల రాజేశం, పాక శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ మానవ హక్కుల ఉల్లంఘనపై స్పందించడమే కాకుండా మంచిని పెంచడం మానవత్వాన్ని పంచడం వంటి కార్యక్రమాలతో పాటు భారత రాజ్యాంగ చట్టాలను అనుసరించి పెన్ను పేపర్ ను ఉపయోగించి దేశంలో మార్పు, చైతన్యం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ఈ ప్రయత్నంలో 14 రాష్ట్ర కమిటీలు మన రాష్ట్రంలో 33 జిల్లా కమిటీల నిర్మాణం పూర్తి చేశామని వారు తెలిపారు. అనంతరం జిల్లాలోని పలు మండల కమిటీల ప్రతినిధులకు నియమక పత్రాలు అందించారు.
హుజురాబాద్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: తాళ్లపెళ్లి దేవేంద్ర
ప్రధాన కార్యదర్శిగా: సబ్బని మాధవి
ఉపాధ్యక్షులుగా: జంపాల సువర్ణ, ఆకునూరి గణేష్
అధికార ప్రతినిధిగా: కొడిమ్యాల పవన్ కుమార్
హుజురాబాద్ పట్టణ అధ్యక్షురాలుగా: మల్లెల సరిత
జమ్మికుంట మండల కమిటీ
అధ్యక్షురాలుగా: ఇటికాల స్వరూప
ప్రధాన కార్యదర్శిగా: ఆరె వసంత
జమ్మికుంట పట్టణ కమిటీ
అధ్యక్షురాలుగా: మధిరే హేమలత
ప్రధాన కార్యదర్శిగా: గూడెపు లలిత
ఉపాధ్యక్షురాలుగా: మౌనిక
సైదాపూర్ మండల కమిటీ
అధ్యక్షురాలుగా: మూల భూలక్ష్మి
ఉపాధ్యక్షులుగా: తలారి రాము
ప్రధాన కార్యదర్శిగా: జంగ కవిత
తదితరులకు నియామక పత్రాలు అందించి సంస్థ విధివిధానాలకు అనుగుణంగా కృషి చేయాలని పేద ప్రజల పక్షాన నిలబడాలని సూచించారు.