బాల్య వివాహాలు నిర్ములనుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.

marriage

బాల్య వివాహాలు నిర్ములనుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

టౌన్ ఎస్సై హరిప్రసాద్

వనపర్తి నెటిదాత్రి:
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని వనపర్తి టౌన్ ఎస్ఐ హరి ప్రసాద్ అన్నారు గురువారం జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలన చట్టాలపై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ బాల్యవివాహాలు చేయడం చట్టరీత్యా నేరమన్నారు ఎవరైనా బాల్య వివాహాలు చేసిన ప్రోత్సహించిన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబడతాయని ఎస్ఐ తెలిపారు . అత్యవసర సమయంలో బాలల కోసం ఏర్పాటుచేసిన చైల్డ్ హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1098, 112, 100 నెంబర్లకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు . బాల్య వివాహాలకు సంబంధించిన వివిధ రకాల బాలలకు సంబంధించిన పోస్టర్లను ఎస్ఐ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఔట్రిచ్ వర్కర్ కె నరేష్ పోలీసు శసిబ్బంది తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!