MLA GSR Stresses the Importance of Reading
ప్రతి ఒక్కరు పుస్తకాలు చదవాలి ఎమ్మెల్యే జీఎస్సార్.
భూపాలపల్లి నేటిధాత్రి
విద్య వికాసానికి మూల మని, అందుకే ప్రతీ ఒక్కరు గ్రంథాలయాలకు వచ్చి విజ్ఞానం పొందాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కోట రాజ బాబు అధ్యక్షతన నిర్వహించిన 58 వ గ్రంథాలయాల వారోత్సవాల వేడుకలకు ముఖ్య అతిథిగా వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జి.ఎస్.ఆర్ మాట్లాడుతూ విద్య ప్రగతికి దోహదం చేస్తుందని, ప్రతీ ఒక్కరు విద్యను అభ్యసించాలని సూచించారు. అదేవిధంగా జీవిత పాఠాలు కూడా నేర్పిస్తుందని అన్నారు. గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని, నేడు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత ప్రతీ విషయాన్ని గూగుల్లో సెర్చ్ చేసి చూస్తున్నారని అన్నారు. అయితే వీటి వలన అనారోగ్యాలతో పాటు అవసరం లేని వాటిని గ్రహించి జీవితం అదుపు తప్పిపోయే ప్రమాదం ఉందని వివరించారు. సెల్ఫోన్ అవసరమే కానీ అతిగా వాడకూడదని సూచించారు. జిల్లా గ్రంథాలయ సంస్థకు అదనపు కొత్త భవన నిర్మాణానికి కోటి రూపాయలు మంజూరి చేస్తామని,అందులో అన్ని సౌకర్యాలతో పాటు అన్ని రకాల పుస్తకాల కొరకు 10 లక్షల రూపాయలు ఎస్ డి ఎఫ్ నిధుల నుండి ఇస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ కోటా రాజబాబు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.
