అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే
సిరిసిల్ల, ఏప్రిల్ – 14(నేటి ధాత్రి):
మహానీయులను స్మరిస్తూ మాతృదేశానికి సేవ చేయడమే వారికి మనం ఇచ్చే ఘాన నివాళి అని, అంబేద్కర్ ఆశయాల దిశగా ప్రతి ఒక్కరు ముందుగు సాగాలన్నారు.
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకల సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా ఎస్పీ మహేష్ బి గితే.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..
సామాజిక వివక్షను జయించి,అత్యున్నత విద్యను సాధించిన గొప్ప మేధావిగా, భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగంగా ఉండడానికి కీలక పాత్ర పోషించిన వ్యక్తి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని, బడుగు,బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం కల్పిస్తూ భారత దేశ అభివృద్ధికి , అభ్యున్నతికి కృషి చేసిన గొప్ప వ్యక్తి అని అభివర్ణించారు.
అంబేద్కర్ జీవితం,బోధనల నుండి ప్రేరణ పొంది,ఆయన ఆశయల దిశగా నేటి యువత నడుం బిగించి ఆయనను ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకోని ముందుకు సాగాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్.ఐ కిరణ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.