బాల కార్మిక నిర్మూలన కొరకై ప్రతి ఒక్కరు పాటుపడాలి. *అనుముల శ్రీనివాస్

శాయంపేట నేటి ధాత్రి:

బాల కార్మికుల నిర్మూలకై ప్రతి ఒక్కరు పాడ్పడాలని ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం బిసిఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అనుముల శ్రీనివాస్ అన్నారు. ప్రజ్వల్ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో గ్రామాలలో పనిచేస్తున్న సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి హాజరై బాల కార్మికులను నిర్మూలించడం కొరకై బి సి ఐ (మంచి పత్తి విధానాలు అమలు) చేస్తున్న గ్రామాలలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బాల కార్మికులు లేకుండా చూడవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని దీనిగాను ప్రతి ఒక్కరికి అవగాహన కలిగించే విధంగా గ్రామాలలో ఎల్జి శిక్షణ కార్యక్రమాలు బాల కార్మిక నిర్మూలన కమిటీలతో సమావేశాల ద్వారా బాల కార్మికులు నిర్మూలకొరకై అంగన్వాడీ టీచర్లు వివిధ బాల కార్మికుల నిర్మూల కమిటీలన్నీ కూడా అవగాహన కల్పించాలని అన్నారు. అదేవిధంగా బాల కార్మికులు అంటే 14 సంవత్సరాల లోపు పిల్లలు బడి మానేసి పనులకు వెళ్లకూడదని ఏమైనా సెలవు దినములు తల్లిదండ్రుల సంరక్షణలో చిన్న చిన్న పనులు మాత్రమే తల్లిదండ్రులకు సహకరించాలి అంతేకానీ 14 నుండి 18 సంవత్సరాల లోపు పిల్లలుప్రమాదకరమైనటువంటి పనులను చేయకూడదని ఇట్టి చర్యలను కమిటీ సభ్యులు ఎల్లవేళలా పరిగణలోకి తీసుకోవాలని వివరించారు. వారి శరీర ఎదుగుదలకు ఆటంకం కలగడమే కాకుండా మానసికంగా, శారీరకంగా కృంగిపోయేటువంటి అవకాశం ఉంటుందని ఈ విషయాలను గ్రామాలలో ఏర్పాటు చేసినటువంటి శిక్షణ కార్యక్రమాలలో వివరించాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టెక్నికల్ కోఆర్డినేటర్ కుమారస్వామి శాయంపేట పియు మేనేజర్ ప్రియంకరెడ్డి అసోసియేట్ పి యు మేనేజర్ అక్కల రమేష్ రేగొండ ,శాయంపేట క్షేత్ర సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *