మల్లక్కపేట గ్రామంలో పర్యటించిన విద్యుత్ అధికారులు ఏడీఈ,ఏఈ
పరకాల నేటిధాత్రి
మండలంలోని మల్లక్కపేట గ్రామంలో శుక్రవారం రోజున విద్యుత్ అధికారులు పర్యటించారు.గ్రామంలో విద్యుత్ మీటర్లు లేని వారికి అవగాహన కల్పించి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహజ్యోతి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ సద్వినియోగం చేసుకోవాలని ప్రతి ఒక్కరూ మీటర్లు పెట్టుకోవాలని విద్యుత్ ఏడిఈ దేవేందర్,ఏఇ సత్యనారాయణ తెలిపారు.ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గ్రామాలలో ప్రతి ఒక్కరూ విద్యుత్ అధికారులకు సహకరించి మీటర్లను పెట్టుకోవాలని విద్యుత్ మీటర్ల లేని వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని భారీ మొత్తంలో జరిమానా విధిస్తూ కేసు నమోదు చేయడం జరుగుతుందని విద్యుత్ అధికారులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సుమన్,పవన్ తదితరులు లు పాల్గొన్నారు.