
Congress Leaders Demand Proper Healthcare for Students
సరైన వైద్యం అందరికి అందాలి
కాంగ్రెస్ పార్టీ గుండాల మండల నాయకులు
గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి:
మండల కేంద్రంలో ప్రభుత్వ దవాఖాన వద్ద జ్వరాలతో బాధపడుతున్న విద్యార్థులను పరామర్శించి వారికి వెంటనే సరైన వైద్యం అందేలా చూడాలని హాస్పిటల్ సిబ్బంది తో మాట్లాడిన యువసేన కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ ఎస్కె ఖదీర్ ఈ సందర్బంగా వారు స్థానిక హాస్పటల్ డాక్టర్ తో మాట్లాడి ఏకలవ్య విద్యార్థుల ఆరోగ్యం పట్ల మెరుగైన వైద్యం అందించి అప్రమత్తం గా ఉండాలని కోరారు, అలాగే సీజనల్ వ్యాధులు ప్రభలుతున్న తరుణంలో ఏకలవ్య మరియు గురుకుల పాఠశాలల్లో హెల్త్ క్యాంపు లను నిర్వహించి వారి ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికపుడు గమనిస్తూ వారికి తగిన ఆరోగ్య చర్యలు చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఏఏంసి డైరెక్టర్ ఊకె బుచ్చయ్య, సీనియర్ నాయకులు మోకాళ్ళ బుచ్చయ్య, నూనావత్ రవి, పూనెం లక్ష్మి, గుర్రం పుష్పరాజ్, గడ్డం రాజేష్, బొంగు చంద్రశేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.