
జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధాని
భూపాలపల్లి నేటిధాత్రి
జాతీయ రోడ్డు భద్రత వసంతోత్సవాల సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ వారి సౌజన్యంతో జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగిందని భూపాలపల్లి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధాని ఒక ప్రకటనలో తెలిపారు..
జాతీయ రోడ్డు భద్రతా మహోత్సవాలలో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో భూపాలపల్లి లారీ డ్రైవర్ అసోసియేషన్, చెల్పుర్,గొర్లవేడు ఆటో యూనియన్ కు సంబంధించిన డ్రైవర్లు ఇతర సిబ్బంది సుమారు 50 మంది వరకు పాల్గొని రక్తదానం చేశారని తెలిపారు.
ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలను పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంధాని
పేర్కొన్నారు.