రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని మోడల్ స్కూల్లో కాలేజీ విద్యార్థులచే జాతీయ ఓటర్ దినోత్సవ సందర్భంగా ప్రతిజ్ఞ చేయించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని, నిజాయితీగా ఓటు వేయాలని ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఓటు విలువ తెలుసుకో భవిష్యత్తును మలుచుకో అని పిలుపునిచ్చారు. తహసిల్దార్ బి భాస్కర్, డిప్యూటీ తహసిల్దార్ అరుణ్ కుమార్, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ వనిజ, ఆర్ఐ బాలకిషన్, తదితరులు పాల్గొన్నారు.