ముత్తారం :- నేటిధాత్రి
ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఎంపీవో బైరి వేణుమాధవ్ సూచించారు.ముత్తారం మండలం లక్కారం గ్రామంలో ఓటరు అవగాహన సదస్సు కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు.ఈ సందర్భంగా
మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని,ప్రతి ఒక్క ఓటరు ఎన్నికల్లో తమ ఓటు తప్పకుండా వేయాలని
సూచించారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ శ్యామల, కార్యదర్శి,గ్రామ పంచాయతీ సిబ్బంది ప్రజలు పాల్గొన్నారు.