కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్
వేములవాడ నేటి దాత్రి
కెసిఆర్ ని మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని దానికి ప్రజలందరూ సహకరించాలని కౌన్సిలర్ నిమశెట్టి విజయ్ కోరారు
వేములవాడ పట్టణ మూడో వార్డు లక్ష్మీపురం లో కౌన్సిలర్ నిమ్మచెట్టి విజయ్ ఆధ్వర్యంలో కెసిఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరిస్తూ ఇంటింటా ప్రచారాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ నిమ్మ శెట్టి విజయ్ మాట్లాడుతూ గడిచిన తొమ్మిదేళ్ల కాలంలో ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాయని అన్ని సప్పండ వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని అన్నారు అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో వేములవాడ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మి నరసింహ రావు ను గెలిపించుకోవడం కోసం కారు గుర్తుపై ఓటు వేసి ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు , అలాగే మినీ పేస్టులో ప్రవేశపెట్టిన పథకాలు ప్రతి పేదవాడికి అందాలంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ను మూడోసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని అది మన అందరి బాధ్యత అని అన్నారు…
ఇట్టి ప్రచార కార్యక్రమంలో , వార్డు సభ్యులు ఎండి లాలు, షేక్ అన్వర్, లింగంపల్లి శంకర్, గద్దపాక నరసయ్య, చిట్యాల మాసయ్య, నికిత, మైసయ్య, శ్రీనివాస్, భవాని , తార , హరీష్, గణేష్, శివ, తదితరులు పాల్గొన్నారు..