స్పెషల్ ఆఫీసర్ జి.సురేందర్.
రేగొండ,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వము బుధవారం నుండి పది హేనుతారీకు వరకు చేపట్ట దలచిన ప్రత్యేక పారి శుద్ధ్య వారోత్సవాల్లో భాగంగా రేగొండ మండలం రామన్నగూడెంతండాలో ప్రత్యేక అధికారి మండల ఎంపీడీవో జి సురేందర్ అధ్వర్యంలో గ్రామస్తులు ఉపాధ్యాయులు గ్రామపంచాయతీ సిబ్బందితో గ్రామంలో ర్యాలీ నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ రామన్నగూడెం తండా గ్రామంలో చెత్తాచెదారం లేకుండా చూడాలని డ్రైనేజీలు శుభ్రంగా ఉంచేలా చూడాలని ఈ పారిశుద్ధ్య వారోత్సవాలలో గ్రామాన్ని అందంగా సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు.ప్రజలకు ఎలాంటి అంటువ్యాధులు సోకకుండా సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. మరమ్మతులో ఉన్న బోరింగ్ లను రిపేరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ బీక్యా నాయక్,మాజీ ఉప సర్పంచ్ కిరణ్,పాఠశాల ప్రధానోపాధ్యాయులు కామిడి సతీష్ రెడ్డి,కుసుమ వెంకటేశ్వర్లు,కార్యదర్శి నవీన్,వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు చందు నాయక్, జగన్ నాయక్ గ్రామపంచాయతీ సిబ్బంది అంగన్వాడి టీచర్ సరస్వతి తదితరులు పాల్గొన్నారు.