
– బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జివి రామకృష్ణ
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ లో ఈనెల 12వ తేదిన బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మాజీ తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ నిర్వహించే పార్లమెంటరీ స్థాయి భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కరీంనగర్ జిల్లా రామడుగు మండలం షానగర్ గ్రామంలోని శ్రీలక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఏర్పాటు చేసిన బిఆర్ఎస్ పార్టీ రామడుగు మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని రాబోయే ఎంపి ఎలక్షన్ లో బోయినిపల్లి వినోద్ కుమార్ యొక్క కారు గుర్తుకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, ఎస్ఆర్ఆర్ గ్రౌండ్లో ఈనెల 12వ తేదిన మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కరీంనగర్ కదన భేరి సభని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈకార్యక్రమంలో మాజీ చోప్పదండి నియోజకవర్గ శాసనసభ్యులు సుంకే రవిశంకర్, రామడుగు సింగిల్ విండో చైర్మన్ వీర్ల వెంకటేశ్వర రావు, మురళి కృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు గంట్ల జితేందర్ రెడ్డి, మాజీ జెడ్పీటీసీ మర్కొండ కృష్ణారెడ్డి, రైతు సభ్యులు కరుణాకర్, సంజీవ్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ మామిడి తిరుపతి, జెడ్పీ కొప్షన్ సుక్రొద్దిన్, ఎంపీటీసీ పోరం అధ్యక్షులు నరేందర్ రెడ్డి,నాయకులు నాగి శేఖర్, లక్ష్మణ్, లచ్చన్న, మాజీ సర్పంచ్ లు ఎంపిటిసిలు నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.