కాంగ్రెస్ పాలనలో రైతన్నలు ఆగమైతున్నరు
కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా
అధికారం ఎవ్వరికి శాశ్వతంకాదు
మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
పరకాల నేటిధాత్రి
హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కేంద్రంలోని ఎఫ్ జే గార్డెన్స్ లో శనివారం రోజున పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పరకాల బీఆర్ఎస్ కార్యకర్తలను,నేతలను కంటికి రెప్పలా కాపాడుకుంటానని అన్నివేళాల అండగా ఉంటా ఎవరూ ఆధైర్యపడవద్దని,ఎవర్కి ఆధికారం శాశ్వతం కాదని,వందరోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని ప్రజల తరపున ఎన్నికల హామీలను అమలు చేయాలని కాంగ్రెస్ పై కొట్లాడుదాంమని పదేండ్లలో తెలంగాణలో ఏ ఒక్కరోజు రైతన్నల ఆత్మహత్యలు జరిగిన సంఘటనలు లేవని మూడు నెలల్లోనే రైతన్నల ఆత్మహత్యలు ఆటో డ్రైవర్స్ ఆత్మహత్యలు నీళ్లు లేక పంటపోలాలు ఎండిపోతున్నాయన్నారు.పరిపాలనను గాలికి వదిలేసి బీఆర్ఎస్ నేతలను ఎమ్మెల్యేలను కొనేపనిలో కాంగ్రెస్ ఉందని తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు ప్రజలు అన్ని గమనిస్తున్నారు.పదేండ్లు అధికారాన్ని అనుభవించి ఎమ్మెల్యేలుగా ఉండి ఇప్పుడు అధికార కాంక్షకోసం పదవుల కోసం పార్టీలు మారుతున్నారు.ఏడాదిలోనే కాంగ్రెస్ లోనే సంక్షోభం ఏర్పడుతుందని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు.ప్రజల సమస్యలను గాలికొదిలేసి బీఆర్ఎస్ నేతలపై,కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి వేదించడమే పనిగా పెట్టుకున్నారు.పదేండ్లలో మేము ప్రజలకోసం తప్పా ప్రతిపక్ష పార్టీల నేతలను కానీ కార్యకర్తలను కానీ వేధించిన సంఘటనలు లేవని పదేండ్లలో ప్రతి ఇంటికి తాగునీళ్లు ప్రతి ఎకరాకు సాగునీళ్లు.కళ్యాణ లక్ష్మీ రైతుబంధు కింద ఎకరాకు పదివేలు ఇచ్చాము ఆసుపత్రులు జిల్లా కలెక్టర్ కార్యాలయాలను మెడికల్ కాలేజీలను నిర్మించామన్నారు.పదేండ్లలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా తీర్చి దిద్దితే కాంగ్రెస్ మాత్రం మూడు నెలల్లోనే దిగజార్చింది స్థానిక ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గంలో మంజూరు అయిన రోడ్లన్నీ రద్దుచేశారని అన్నారు.ఎమ్మెల్యే గారికి చిత్తశుద్ది ఉంటే 100 పడకల హాస్పిటల్ నిర్మాణం పూర్తి చెయ్యండి.మంజూరైన రోడ్ల పనులు ప్రారంభించండి.ఎండిపోతున్న పంటపొలాలకు నీరందించండని అన్నారు.పార్టీని వీడిన వారితో మనకు నష్టం ఏమీలేదు పరకాల నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు,కార్యకర్తలు ఎవరూ ఆధైర్యపడకండని జెండా మోసే ప్రతి కార్యకర్తలు నేను అండగా ఉంటానని పదేండ్లు అధికారంలో ఉన్నాము ఏడాది లేకపోతే ఏమి కాదని మీకు ఏ కష్టమోచ్చిన నేను అందుబాటులో ఉంటానని అన్ని విధాలుగా తోడుంటానని మాది రాజకీయ కుటుంబం కాదని నేను పదవులకోసమో అధికారంకోసమో రాజకీయాల్లోకి రాలేదని నేను ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం వచ్చానని నేను పార్టీ మారుతున్నానని కొంత మంది దుస్ప్రచారం చేస్తున్నారు అలాంటివి మానుకోవాలని హెచ్చరిస్తున్నా తెలంగాణ తెచ్చిన నాయకులు కేసీఆర్ వెంట ఉంటా పార్టీ మారాల్సిన అవసరం నాకు లేదని బి.ఆర్ ఎస్ పార్టీని వీడిన వారే పచ్చాత్తాప పడే రోజులు దగ్గరే ఉన్నాయని అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మండల,పట్టణ కమిటీల నాయకులు,మహిళ నాయకురాళ్లు,యూత్ నాయకులు,వివిధ గ్రామాల కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.