కాంగ్రెస్ పార్టీలో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకు స్థానం కల్పించాలి

బొచ్చు కుమార్ 4వ వార్డు అధ్యక్షులు

పరకాల నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో, పీసీసీ పదవితోపాటు ఎమ్మెల్సీ, రాజ్యసభ,నామినేటెడ్‌ పదవుల కోసం నాయకులు బారులు తీరుతున్నారు. టికెట్లు త్యాగం చేసిన వారితోపాటు,పార్టీ గెలుపు కోసం నిరంతరం శ్రమించిన నేతలు కూడా పదవుల కోసం పోటీ పడుతున్నారు. ఎన్నికల సమయంలో టికెట్లు దక్కని వారికి పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు వారికి కూడా సర్దుబాటు చేయాల్సి ఉండడంతో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డినే నిశితంగా పరిశీలన చేస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే ప్రతి ఒక్క నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.పది సంవత్సరాల నుండి కష్టపడిన ప్రతి కార్యకర్తకు ఫలితం దక్కేలా అధిష్టానం గుర్తించాలని పరకాల మున్సిపాలిటీ పట్టణంలో 4వ వార్డు అధ్యక్షుడు బొచ్చు కుమార్ పరకాల వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ పదవిని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ సందర్బంగా కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ కోసం కష్టపడిన కార్యకర్తలకు గుర్తింపు ఎక్కడ పార్టీలు మారే వలస వాదులకే ప్రాధాన్యత పార్టీ కోసం కష్టపడ్డవారిని కనుమరుగు చేస్తే ప్రయత్నంలో కొందరు నియోజవర్గ నాయకులు పట్టణ నాయకులు తెరాస నాయకులను పార్టీలో చేర్చుకోవడం కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేసినట్టే అవుతుందని ప్రజలు కాంగ్రెస్కి తోడుగా ఉన్నప్పుడు ఈ కౌన్సిలర్లు వచ్చి కొత్తగా కాంగ్రెస్ చేసేది ఏముంది అని ఎగతాళి చేసిన రోజులు ఉన్నాయి కాంగ్రెస్ నాయకులను కార్యకర్తలను శత్రువులు చూసిన ఆ తెరాస నాయకులు ఒక సంక్షేమ పథకం అందకుండా చేసే ఎన్నో రకాలుగా ఇబ్బందులు గురిచేసి అవమానించారని కనీసం ప్రజాస్వామ్య విలువలు మరిచి వారు వ్యవహరించిన తీరు ప్రతి కార్యకర్తపై సామాన్య ప్రజలపై ప్రభావం పడింది కాబట్టి స్థానిక ఎమ్మెల్యే పరకాల నియోజకవర్గంలో గెలిపించిన కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్తకు న్యాయం చేయాలని అలాగే వారికి ముందుగా ప్రియాతి ఇవ్వాలని నామినేటెడ్ పదవుల్లో స్థానం కల్పించాలని ఈ సందర్భంగా కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!