వరంగల్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేయాలి
జిల్లా అధ్యక్షుడు నిశీధర్ రెడ్డి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోనీ ఏ ఎస్ ఆర్ గార్డెన్ వరంగల్ పార్లమెంట్ స్థానం గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని బూతు స్థాయి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేసిన బిజెపి పార్టీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వరంగల్ అభ్యర్థిగా అధిష్టానం నా పేరును ప్రకటించడం సంతోషంగా ఉందని అన్నారు. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా కాషాయ జెండా ఎగరా వేస్తామనే నమ్మకం మీ అందరిని చూస్తుంటే కలుగుతుందని ఉన్నారు. రేపటి మన తెలంగాణ భవితను మార్చబోతుంది ఈ గెలుపెనని అన్నారు. ఈ వరంగల్ సీట్ ప్రధాని నరేంద్ర మోడీ కి కానుకగా ఇవ్వాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తకు ఉందని అన్నారు. రేపు మనం గెలవబోయే సీటు ప్రజల గెలుపుగా, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల విజయంగా చరిత్రలో నిలుస్తుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతి ఒక్కరిని కూడా ఈ విజయంలో మనం భాగం చేయాలని అన్నారు. ప్రతి బూతులోని లబ్ధిదారులను నేరుగా కలిసి వారికి ప్రధాన నరేంద్ర మోడీ అందించిన పథకాలను సహకారాన్ని గురించి వివరించాలని కోరారు. ఈ ఎంపీ సీట్ మనం గెలిస్తే భూపాలపల్లి కి గ్రోత్ కారిడార్ గా చేసి వాణిజ్యపరంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. భూపాలపల్లి జిల్లాలో మహిళాలు అధికంగా వెనుకబడి ఉన్నారు. వారికి స్వయం ఉపాధి కింద MSME ల కింద చిన్న మరియు మధ్య తరహా వ్యాపారాలకు సహకారాన్ని అందిస్తామని అన్నారు.
అలాగే ఓపెన్ కాస్ట్ నిర్వాసితులకు ఇప్పటివరకు నష్టపరిహారాన్ని అందించలేదు వారికి నష్టపరాన్ని అందించే వరకు రాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తెస్తామని అన్నారు. భూపాలపల్లి జిల్లాను అన్ని విధాలుగా అభివృద్ధి చేసి అవకాశం వచ్చిందని అన్నారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరిపై ఉందని అన్నారు. అందుకోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై భారతీయ జనతా పార్టీ కోసం కృషిచేయలన్నారు. ఈ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగురవేయడమే మన ముందున్న ఏకైక లక్ష్యం అన్నారు.
ఈ కార్యక్రమంలో సభాధ్యక్షులు మోరే రవీందర్ రెడ్డి బిజెపి పార్టీ జిల్లా అధ్యక్షులు నిశీధర్ రెడ్డి పార్లమెంట్ ప్రబారి మురళీధర్ గౌడ్ రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తి రెడ్డి పార్లమెంట్ కన్వీనర్ తాళ్లపల్లి కుమారస్వామి మాజీ జిల్లా అధ్యక్షులు, ప్రస్తుత బిజెపి రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యులు నాగపురి రాజమౌళి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెన్నంపల్లి పాపన్న చదువు రామచంద్రారెడ్డి కన్నం యుగదీశ్వర్ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రాజేందర్ పార్లమెంటు కో కన్వీనర్ లింగంపల్లి ప్రసాదరావు బిజెపి నర్సంపేట్ ప్రబారి చందుపట్ల సత్యపాల్ రెడ్డి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి బట్టు రవి భూపాలపల్లి జిల్లా నాయకులు, బూత్ స్థాయి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొనడం జరిగింది.