గెలిస్తే కుర్చీ…ఓడితే కుస్తీ!

https://epaper.netidhatri.com/view/334/netidhathri-e-paper-30th-july-2024%09

`జనాన్ని పట్టించుకోకపోతే ఎవరికైనా ఇదే గతి!

`ఓడిపోవడం తప్పు కాదు…తప్పు తెలుసుకోకపోవడం తప్పు!!

`ప్రజలు ఓడిరచి తప్పు చేశారని నిందించడం అంతకన్నా తప్పు!

`ప్రజలు నన్నే ఎన్నుకోవాలనుకోవడం మూర?త్వం.

`పార్టీని ఓడిరచారని అసెంబ్లీకి రాననడం జగన్‌ పిరికితనానికి నిదర్శనం.

`పారిపోతున్నానని చెప్పడానికి సంకేతం.

`నన్నెందుకు ఓడిరచారని ఆత్మపరిశీన అవసరం.

`ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు.

`ఎవరిని గెలిపించుకోవాలో నిర్ణయించుకునే నిర్ణేతలు.

`ప్రజలకు ఎంతో చేశామని చెప్పుకోవడం నాయకుల అవివేకం.

`జనం సొమ్ముతో సోకులు చేసుకునే నాయకులు జనాన్ని నిందించడం అహంకారం.

`ఏ నాయకుడు తన సొమ్ము ప్రజలకు పంచరు.

`మెరుగైన పాలన చేశామని నాయకులు అనుకుంటే సరిపోదు.

`ప్రజలను నిందించే అధికారం ఎవరికీ లేదు.

`నాయకులు ప్రజలను నిందించడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధం.

`మళ్ళీ ప్రజల మనసు గెలుచుకునే ప్రయత్నం చేయాలి.

`ప్రజలు మెప్పు పొందే పాలన సాగిస్తామని సాగిలపడాలి.

`ప్రజల మెప్పుకోసం నిరంతరం ప్రయత్నించాలి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప అసెంబ్లీకి రాను అంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు ఎదురౌతున్నాయి. సాక్ష్యాత్తు జగన్‌ చెల్లెలు షర్మిల అన్న మీద ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్న తర్వాత అసెంబ్లీకి రాను అని చెప్పడం దివాళాకోరుతనమంటూ కూడా వ్యాఖ్యానించింది. అసెంబ్లీకి రాను అనుకున్నప్పుడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్యమని డిమాండ్‌ చేసింది. అప్పుడు ఆఫ్రికా అడువులకు వెళ్తాలో, ఆస్ట్రేలియాకు వెళ్తావో ఎవరూ పట్టించుకోరని ఓ ఉచిత సలహా పడేసింది. దాంతో ఏపిలో ఇది ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అయ్యింది. నిజానికి ఇలాంటి విమర్శలు తెలుగుదేశం పార్టీ నుంచో, జనసేన, బిజేపిల నుంచో వస్తే అందులో పెద్ద ఆసక్తి వుండకపోయేది. కాని స్వయంగా తన చెల్లెలు షర్మిల చేసిన వ్యాఖ్యల మూలంగా జగన్‌కు సమాధానం చెప్పుకోలేని పరిస్దితి ఎదురైంది. 2019 ఎన్నికల్లో జగన్‌కు 151 సీట్లిచ్చిన ఏపి ప్రజలు, ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కేవలం 23 మంది ఎమ్మెల్యేలనే ఇచ్చారు. అయినా చంద్రబాబు బేషజాలకు వెళ్లలేదు. ప్రజలను నిందించలేదు. జనం తీర్పును తప్పు పట్టలేదు. 23 ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వచ్చారు. ఆ ఎమ్మెల్యేలలో కొంత మంది చేజారినా, వారితో కలిసి జగన్‌కు ఎదుర్కొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు గొంతు నొక్కినా, ఆయన ధైర్యం కోల్పోలేదు. ఆఖరుకు స్కిల్‌ డెవలప్‌ మెంటు కేసు పేరుతో 73 వయసులో జైలుకు పంపినా వెరవలేదు. దైర్యం చెడలేదు. జైలు నుంచి వచ్చిన తర్వాత తన విమర్శలు మరింత పదును పెట్టారు. జగన్‌ మీద సింహ గర్జన చేశారు. ఓడిస్తానని సవాలు చేశాడు. జనాన్ని చైతన్యం చేశాడు. జనం తన వైపు చూసేలా చేసుకున్నాడు. జగన్‌ పాలనను చరమగీతం పాడేదాకా విశ్రమించలేదు. ఒక నాయకుడి పట్టుదల అలా వుండాలి. ప్రజా జీవితంలో వ్యక్తిగత ఆలంబనకు చోటు లేదు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాను అనడం వల్ల ప్రజల్లో జగన్‌ మరింత పలచన కావడమే తప్ప ప్రయోజనం లేదు. ప్రజలే ప్రతిపక్షానికి కూడా పనికి రావని తేల్చేసిన తర్వాత నాకు ప్రతిపక్ష పాత్ర కావాలని కోరుకోవడంలో అర్దం లేదు.
ప్రజలు ఆదరించి అధికారమిస్తే కుర్చీలో కూర్చుంటా…లేకుంటే ఇంట్లో కూర్చుంటా! అనేది రాజకీయ నాయకులు చెప్పాల్సిన మాట కాదు. అందులోనూ ముఖ్యమంత్రులుగా పనిచేసిన నాయకులకు అసలు తగదు. కోట్లాది మంది ప్రజలు పాలించమని గెలిపించిన తర్వాత ప్రజారంజక పాలన సాగించకపోవడం నాయకుల తప్పు. అంతే కాని తనుకు తాను గొప్పగా పాలించానని భ్రమ పడి,ప్రజలు ఓడిరచి తప్పు చేశారన్న భావన నాయకులకు రావొద్దు. అది ఎవరూ హర్షించరు. సరిగ్గా ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్షపాత్ర పోషిస్తున్న నేతలు వ్యవహార శైలి సరైంది కాదు. కాకపోతే ఇందులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్‌ వేరు. ఏపి మాజీ ముఖ్యమంత్రి జగన్‌ వేరు. తెలంగాణ విషయానికి వస్తే కేసిఆర్‌ రాష్ట్ర సాధన కోసం తన జీవిత కాలం పోరాటం చేశారు. ఉద్యమాలు చేశారు. తెలంగాణ సమాజాన్ని కూడట్టారు. పద్నాలుగేళ్లపాటు సుధీర్ఘమైన పోరాటంచేశారు. తెలంగాణ వచ్చేదాకా తన పంతం వీడలేదు. ఉద్యమాన్ని ఎక్కడా వదిలేయలేదు. కడదాకా కొట్లాడాడు. ప్రాణాలను సైతం ఫణంగా పెట్టేందుకు వెనుకాడలేదు. తర్వాత ముఖ్యమంత్రిగా పదేళ్లపాటు పనిచేశారు. తెలంగాణను ఒక రేవుకు తెచ్చారు. ఎంతో కొంత ఒడ్డున పడేశారు. పదేళ్ల కాలంలో తన శక్తికి మించే పనిచేశారు. వయసు రిత్యా ఆయన ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లడం కొంత ఇబ్బందికరమైన పరిస్దితి. ఉద్యమ సమయంలో ఆయన దూకుడుగా వున్నారు. కాని ఇప్పుడు తన మాటల ద్వారా ప్రజల్ని చైతన్యం చేసే శక్తి యుక్తులున్న నాయకుడు. మరి జగన్మోన్‌రెడ్డిది ఆ పరిస్దితి కాదు. జగన్‌ ప్రజల నుంచి వచ్చిన నాయకుడు కాదు. వారసత్వాన్ని పునికి పుచ్చుకొని వచ్చిన నాయకుడు. తన తండ్రికి జరిగిన అన్యాయం మీద ప్రజల సానుభూతితో ప్రజా నాయకుడయ్యారు. అయినా ఆయన ఖాళీగా కూర్చున్నది లేదు. ప్రజల్లో వున్నారు. అయితే కేవలం ఇప్పుడు తన చేష్టల ద్వారా ప్రజల ముందు మరింత పలుచనౌతున్నారు. కేవలం అధికారం కోసమే జగన్‌ రాజకీయాలను ఎంచుకున్నారన్న భావన ప్రజల్లో నెలకొనేలా చేసుకుంటున్నాడు. వైఎస్‌. రాజశేఖరరెడ్డి చనిపోయిన తర్వాత జగన్‌ మీద తెలుగు ప్రజల్లో ఎంత సానుభూతి పెరిగింది. ఆయన నాయకత్వాన్ని ప్రజలు బలపర్చారు. ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ముఖ్యమంత్రి కావాలని కలలు గన్నాడు. వైఎస్‌ చనిపోయిన తర్వాత తానే ముఖ్యమంత్రిని కావాలనుకున్నాడు. కాని జరగలేదు. కాంగ్రెస్‌ మీద కోపం పెంచుకున్నాడు. కాంగ్రెస్‌ నుంచి బైటకు వచ్చాడు. సొంత కుంపటి పెట్టుకున్నాడు. ఓదార్పు యాత్రతో ప్రజల్లోకి వెళ్లాడు. అది కేవలం తన నాయకత్వాన్ని పదిలం చేసుకునేందుకు, బలం పెంచుకునేందుకు మాత్రం చేసిందే కాని, దాని వల్ల ప్రజలకు ఒనగూరిందేమీ లేదు. అయినా ప్రజలు సానుభూతిని చూపించారు. ఆయన వెంట ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాడు. 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే అందులో 15 మంది గెలిచారు.
సీమాంద్ర నుంచి జగన్‌కోసం మంత్రి పదవి వదులుకున్న పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ఓడిపోయారు. తెలంగాణ నుంచి మంత్రి పదవికి రాజీనామా చేసి, జగన్‌ వైపు నిలుచుకున్న ప్రస్తుత మంత్రి కొండా సురేఖ ఓడిపోయారు. కాని జగన్‌ ప్రభావం మాత్రం ఉమ్మడి రాష్ట్రంలో పెరిగింది. రాష్ట్ర విభజనతో జగన్‌కు ఏపిలో బలమైన నాయకుడిగా గుర్తించినా, పాలించేంత నాయకుడిగా ప్రజలు కోరుకోలేదు. 60 సీట్లిచ్చిన ప్రతిపక్ష పాత్రలో కూర్చోబెట్టారు. దాంతో ప్రజల్లోకి వెళ్లారు. నవరత్నాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. పాదయాత్ర చేపట్టి ప్రజలకు చేరువయ్యాడు. కనీవినీ ఎరుగని రీతిలో 151 సీట్లిచ్చి ముఖ్యమంత్రిని చేశారు. అంత పెద్ద మెజార్టీ ఇచ్చి ప్రజలు పాలించమని అవకాశమిస్తే తెలుగుదేశం నాయకుల మీద కక్ష తీర్చుకునేందుకు అధికారం పరిమితం చేసుకున్నాడు. ప్రజలకు తాయిలాలిస్తున్నాను..వాళ్లు ఓడిరచరన్న భ్రమలో పగటి నిద్రలు తీశాడు. జగన్‌ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కరోనా కాలం వచ్చిపడిరది. అలా రెండేళ్ల పుణ్యకాలం కరిగిపోయింది. ఆ తర్వాతనైనా జగన్‌ జనంలోకి రావడం మానేశారు. కనీసం సెక్రెటరియేట్‌ వెళ్లకుండా ఇంట్లో నుంచే పరిపాలన సాగించాడు. నాయకులు అందుబాటులో లేడు. ప్రజలకు ముఖం చూపించలేదు. దాంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేక వచ్చింది. కాని దాన్ని జగన్‌ గుర్తించలేదు. తెలుగుదేశం పార్టీ పెరుగుతుందని అంచనా వేయలేదు. జనసేన పుంజుకుంటుందని ఊహించలేదు. కేవలం తన నవరత్నాలే కాపాడుతాయనుకున్నాడు. అవే పధకాలు నిండా ముంచుతాయని కలలో కూడా కలగనలేదు. జగన్‌ ఇచ్చిన హమీలనే కాపీ కొట్టి చంద్రబాబు, వాటికి మరింత అదనంగా సొమ్ముచేర్చి ప్రచారం చేశారు. విజయం సాదించారు. తెలంగాణలో ఏపికన్నా ఆరు నెలలు ముందే ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో గతంలో కేసిఆర్‌ ఇచ్చిన హమీలకు కాంగ్రెస్‌ మరింత జోడిరచింది. రైతు బంధు లాంటి వాటికి మరింత సొమ్ము జోడిస్తామని చెప్పింది. కాంగ్రెస్‌ విజయం సాధించింది. సరిగ్గా అదే ఫార్ములాను ఏపిలో ఎన్డీయే కూటమి అనుసరించింది. అప్పుడైనా జగన్‌ తేరుకోవాల్సి వుండే. కాని మేలుకోలేదు. ఒటమి జరిగిపోయింది. ఇప్పుడు చింతించాల్సిన సమయంకాదు. ప్రజలను నిందించాల్సిన సందర్భం అంతకన్నా కాదు. తనకు ప్రతిపక్ష హోదా అడిగేందుకు హక్కు లేదు. పొత్తులో భాగంగా గెలిచిన జనసేనుకు మించిన సీట్లు కూడా రాలేదు. అందులో సగం సీట్లు వచ్చిన జగన్‌ ప్రతిపక్ష నాయకుడి హోదా అడగడం అంటే పదవిని యాచించడమే అవుతుంది. ఎవరికీ తలవంచను. మాట తప్పను…మడమ తిప్పను గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. ముఖ్యమంత్రి హోదా పోయిన తర్వాత మళ్లీ ఆ హోదా కోసం ప్రయత్నం మొదలు పెట్టాలే గాని, ప్రతిపక్ష హోదా కోసం పాకులాడడం అంటే తనను తాను తగ్గించుకోవడమే అవుతుంది. తనకు ప్రతిపక్ష హోదానే పెద్దది అని అంగీకరించినట్లౌవుంది. ఇంత చిన్న లాజిక్‌ జగన్‌ ఎలా మర్చిపోయాడో అర్దం కానిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!