రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు ఎంతో మేలు

– అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ
– ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు


– రైతులకు రైతు రుణమాఫీ పండగ
సిరిసిల్ల(నేటి ధాత్రి):
రాజన్న సిరిసిల్ల జిల్లా
సిరిసిల్ల పట్టణం అంబేద్కర్ చౌరస్తాలో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు లక్ష లోపు రుణమాఫీ చేస్తున్న క్రమంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద టపాసులు కాల్చి, స్వీట్లు పంచుకొని అక్కడి నుండి చంద్రంపేట రైతు వేధికకు బైక్ ర్యాలీ లో పాల్గొన్న నియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డి. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ
అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అందేలా పకడ్బందీ చర్యలు తీసుకున్నాం అన్నారు.
ప్రతి మండల కేంద్రంలో బ్యాంకర్లు, వ్యవసాయ అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసారు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ పథకం మన జిల్లాలో అర్హులైన ప్రతి రైతుకు వర్తించేలా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి అదేశాలు జారీచేశారనీ అన్నారు.
ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మొదటి విడత కింద మన జిల్లాలో లక్ష రూపాయల లోపు రుణం తీసుకున్న 23 వేల 986 మంది రైతుల రుణాల సోమ్మును ప్రభుత్వం జమ చేస్తుందనీ అన్నారు.
రైతులకు రైతు రుణమాఫీ సొమ్ము చేరేలా బ్యాంకులు, వ్యవసాయ అధికారులు సమన్వయంతో పని చేస్తున్నాయనీ అన్నారు.
తెలంగాణ రైతులు నిన్న తొలి ఏకాదశి పండగ జరుపుకొని ఇవ్వాలా రైతు రుణమాఫీ పండగ చేసుకుంటున్నారనీ అన్నారు.
రైతుల మొహాల్లో సంతోషం చూడాలని వరంగల్ సభలో రాహుల్ గాంధీ రైతు డిక్లరేషన్ చేసారన్నారు.
మొదటి విడతగా లక్ష రుణమాఫీ చేస్తున్నాం.
ఆగస్టు 15 లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తాం, రైతులు తలెత్తుకునేల చేస్తామని అన్నారు.
వ్యవసాయం దండగ కాదు పండగ అనేలా చేస్తామన్నారు.
గత ప్రభుత్వం ఎన్నో అప్పులు చేసిన మాట తప్పకుండా మడుమ తిప్పకుండా ఆన్న మాట నిలబెట్టుకున్నామన్నారు.
దేశంలో కనివిని ఎరుగని రీతిలో 32 లక్షల మందికి రుణమాఫీ చేశామన్నారు.
రైతు రుణమాఫీ తో మేము ఆరు గ్యారంటీలు అమలు చేసి చూపించామన్నరు.
కాంగ్రెస్ పార్టీ బడుగు బలహీన వర్గాలు, బీసీ, మైనార్టీలకు, రైతులకు అండగా ఉంటుందన్నారు.
రుణమాఫీ ద్వారా ప్రతి రైతుకు ఎంతో మేలు చేస్తుందన్నారు. అనంతరం
సచివాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి…రుణమాఫీ పొందిన వివిధ జిల్లాల రైతులతో వీడియో కాన్ఫరెన్స్ లో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి.
సిరిసిల్ల లోని చంద్రంపేట రైతు వేదిక నుండి రైతు రుణ మాఫీ సంబరాల్లో పాల్గొన్న కేకే మహేందర్ రెడ్డి, అధికారులు, రైతులు, ప్రజా ప్రతినిధులు తదితరులు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి పాల్గొన్న
డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహా దారు వేం నరేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహా దారు కె కేశవరావు , సీఎస్ శాంతి కుమారి,ఉన్నతాధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *