Dealers Must Follow Fertilizer Control Rules
ప్రతి డీలర్ ఎరువుల నియంత్రణ చట్టం లోబడి వ్యాపారం చేసుకోవాలి
జిల్లా డివిజన్ సహాయ వ్యవసాయ సత్యాలకులు అజ్మీర శ్రీనివాసరావు
కేసముద్రం/ నేటి ధాత్రి
బుధవారం కేసముద్రం మండలంలో మహబూబాద్ డివిజన్ సహాయ వ్యవసాయ సంచారకులు అజ్మీర శ్రీనివాసరావు కేసముద్రం మండల వ్యవసాయ అధికారి బి వెంకన్న తో కలిసి పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ, ఎరువుల దుకాణంలో స్టాక్ రిజిస్టర్లు, బిల్ బుక్కులు,ఇన్వైసులు, పి ఓ ఎస్ మిషన్ బాలన్స్, గోడౌన్ బ్యాలెన్స్, స్టాక్ బోర్డు తనిఖీ చేయడం జరిగింది, వారు మాట్లాడుతూ ప్రతి డీలరు రైతులకు విధిగా బిల్లులు ఇవ్వాలని, ప్రతిరోజు స్టాక్ రిజిస్టర్, స్టాక్ బోర్డు అప్డేట్ చేయాలని, ప్రతిరోజు ఎరువుల నిలువలను మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలని వారు తెలియజేశారు . అదేవిధంగా ప్రతి డీలర్ ఎరువుల నియంత్రణ చట్టం 1985 లోబడి వ్యాపారం చేసుకోవాలని వారు సూచించారు, స్టాక్ రిజిస్టర్ బ్యాలెన్స్ పి ఓ ఎస్ మిషన్ బ్యాలెన్స్,గోడౌన్ బ్యాలెన్స్, స్టాక్ బోర్డ్ బాలన్స్ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలని వారు తెలియజేశారు, అతిక్రమించిన డీలర్ల పై నిత్యావసర వస్తువుల చట్టం 1955 ప్రకారం శాఖపరమైన చర్యలు తీసుకుంటామని వారు తెలియజేశారు.
