అధికారులు మారినా బోర్డులు మారలే..!
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల తహసిల్దార్ కార్యాలయంలో నయబ్ తహసిల్దార్ బదిలీ అయి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం బోర్డు మాత్రం పాతదాన్నే కొనసాగిస్తోన్నారు. ఈ బోర్డులో సమాచారాన్ని అం దించే అధికారుల పేర్లు లేకపోవడంతో ప్రజలు సమాచారం కోసం ఎవరిని సంప్రదించాలనే అయోమయంలో ఉన్నారు. ఇందులో సీనియర్ సహాయకులు ఎవరన్నది ఇప్పటి వరకు బోర్డులోను, కార్యాలయంలోను లేకపోవడం గమనార్హం. కొత్త అధికారుల వివరాలతో బోర్డును నవీకరిం చకపోవడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని, వెంటనే బోర్డు మార్చాలని వివిధ గ్రామాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.