ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:-
ఓదెల మండలంలోని గుంపుల గ్రామానికి చెందిన తిప్పని శ్రీనివాస్ తను ఇంటర్ చదివే సమయంలో ఆర్మీకి సెలెక్ట్ అయి ఆర్మీలో 17 సంవత్సరాలు అనేక సేవలు చేసి రిటైర్మెంట్ గత మూడు సంవత్సరాలు నుండి గుంపుల గ్రామంలో తనకున్న వ్యవసాయ పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు ఈ నేపథ్యంలో ఈ మధ్యలో టిఎస్ ఎస్ పి ఉద్యోగానికి రాత పరీక్ష నిర్వహించగా ఈరోజు మళ్లీ తాను కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించడం చాలా అరుదైన విషయం తన వృత్తి పోలీస్ నౌకరితోటే ముడిపడి ఉందంటూ తిప్పని శ్రీనివాస్ సంతోషం వ్యక్తం చేశారు.
ఈ నేపథ్యంలోనే ఇదే గ్రామానికి చెందిన మరో వ్యక్తి గాదం విదర్శ్ తెలంగాణ పోలీస్ పోలీసు అధికారిగా ఉత్తీర్ణత సాధించాడు 10వ తరగతి వరకు గ్రామాల్లో అనంతరం పై చదువులు హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు.వ్యవసాయ కుటుంబం కావడంతో నిత్యం పొలం పనులు చేస్తూ పోలీస్ కావాలనే లక్ష్యంతో చదివి ఉద్యోగం సంపాదించాడు.దీంతో గ్రామంలో వారంతా ఇరువురిని అభినందిస్తున్నారు.