
ప్రభుత్వం ఏర్పడి 20 నెలలైనా అమలు కానీ పంచాయతీ కార్మికుల హామీలు
హామీల అమలుకై సమరశీల పోరాటాలు
మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలి
వేతనాలు నెలవారి సక్రమంగా చెల్లించాలి సిఐటియు డిమాండ్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.,నేటిధాత్రి…
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు గడుస్తున్నా నేటికీ పంచాయతీ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని హామీల అమలుకై పంచాయతీ కార్మికులు సమరశీల పోరాటాలకు సిద్ధమవ్వాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గద్దల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు మండల కేంద్రంలో గ్రామపంచాయతీ కార్మికుల జనరల్ బాడీ సమావేశం గుమ్మడవెల్లి కృష్ణ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పంచాయతీ కార్మికులకు కనీస వేతనాలు అమలు చేస్తామని హామీ ఇచ్చిందని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మల్టీ పర్పస్ విధానాన్ని రద్దు చేయాలని వేతనాలు క్రమం తప్పకుండా బ్యాంకు ద్వారా చెల్లించాలని వారు డిమాండ్ చేశారు వారికి పిఆర్సి అమలు చేయాలని పిఎఫ్, ఈఎస్ఐ ,రిటైర్మెంట్ బెనిఫిట్ తదితర సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు నూతన కమిటీ గౌరవాధ్యక్షులుగా గుమ్మడవెల్లి కృష్ణ, అధ్యక్షులుగా గాంధర్ల ధనంజయ్, ప్రధాన కార్యదర్శిగా చర్ప సాంబశివరావు ట్రెజరర్ గా ఉప్పలి సాంబశివరావు లతోపాటు పదిమంది ని కమిటీ సభ్యులుగా కంగాల సురేష్, వడ్లకొండ శ్రీను, కొమరం ప్రశాంత్, మెంతిని శంకర్, కల్లూరి రమేష్ నిట్టా ప్రసంగిలను ఎన్నుకున్నారు ఈ సమావేశంలో సిఐటియు నాయకులు కొమరం కాంతారావు పాల్గొన్నారు