జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పురాతన మహా లింగేశ్వరస్వామి ఆలయం (బొమ్మల గుడి)లో గత సంవత్సరకాలంగా అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్య అన్నదానం నిర్వహించడం అభినందనీయమని మండల పరిధిలోని వెంకటేశ్వర్లపల్లి గ్రామానికి చెందిన మోటం జోసెఫ్ రాజేశ్వరి కొడుకు మోటం సంతోష్ జ్ఞాపకార్థం జమ్మికుంట విశ్వేశ్వరస్వామి ఆలయంలో అన్నదానం చేస్తున్న సందర్భంగా అన్నారు. నిస్వార్థంగా ఆలయ సన్నిధిలో రోజుకు 100 నుండి 150 మంది పేదలు, అనాథలకు నిత్యం ఒక పూట కడుపు నింపడం ఎంతో గొప్ప విషయమని కొనియాడారు. నా కొడుకు జ్ఞాపకార్థం సందర్భంగా అన్నదానం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముదురుకొల్లా భాగ్య, ముదురుకొల్లా రాజశేఖర్, మోటం రిస్పా, టేకు రాకేష్, రెబెల్లి భాగ్య, యాంసాని సురేష్ తదితరులు పాల్గొన్నారు.