మండల ప్రత్యేక అధికారి రాజమణి
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలంలోని వివిధ గ్రామాల్లో సద్దుల బతుకమ్మ పండుగ ఏర్పా ట్లును ప్రత్యేక అధికారి రాజమణి స్థల పరిశీలన చేశారు. స్థల పరిశీలన కోసం శాయంపేట పత్తిపాక మైలారం గ్రామాలను పర్యటించడం జరిగింది. స్థలంలో లైట్లు రోడ్డు మార్గం చెత్తాచెదారం శుభ్రత గురించి మాట్లాడడం జరిగింది. సద్దుల బతుకమ్మను తెలంగాణ సంప్రదాయ బద్ధంగా మహిళలు కోలాలాటలు ఆడుకునేందుకు స్థల పరిశీలన చేశారు ఈ కార్యక్రమంలో డి ఈ టి ఎస్ ఇ డబ్ల్యు ఐ డి సి రవీందర్, ఎంపీడీవో ఫణి చంద్ర ఎంపీ ఓ రాజకుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.