వేసవిలో బాటసారులకు దాహార్తి తీర్చడానికి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ V101A మరియు హరిప్రియా పీడ్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఈ చలివెంద్రం ప్రారంభ కార్యక్రమానికి డిస్ట్రిక్ట్ క్యాబినెట్ సెక్రటరీ విడియాల నూతన్ కుమార్, గుండా అమర్ నాథ్, వేములపల్లి సునిల్ గారు పాల్గొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం రైల్వే ప్రయాణికులు దాహం తీర్చుకోవడానికి ఎంతగానో దోహదం పడుతుందని గుండా అమర్ నాథ్ గుప్తా తెలిపారు.వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడిని ఎదుర్కోవడానికి తాము ఏర్పాటు చేసిన చలివేంద్రంలో చల్లని 80 లీటర్ల సామర్ద్యం కలిగిన ఆర్వో వాటర్ అందు బాటులో ఉంటుందని, ఉదయం నుండి సాయంత్రం వరకు ఈ చలివేంద్రం ప్రజలకు సేవలను అందిస్తుందని నిర్వాహకులు వేములపల్లి సునిల్ గారు తెలిపారు.