
Sub Collector Office.
మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డు ఏర్పాటు చేయండి
మెట్ పల్లి సెప్టెంబర్ 12 నేటి దాత్రి
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పరిపాలన సౌలభ్యం కోసం జిల్లాలు రెవెన్యూ డివిజన్ మండల ఏర్పాటు చేశారు ఈ సందర్భంలో మెట్పల్లి గత చరిత్ర ఆధారంగా చేసుకుని మేము చేసిన ఉద్యమాలను పరిగణములోకి తీసుకొని ప్రభుత్వం 2017 సంవత్సరంలో మెట్పల్లిని రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేయడం జరిగింది మరింత పరిపాలన అందించడానికి ఆగస్టు 2019 సబ్ కలెక్టర్ కార్యాలయం గా అభివృద్ధి చేశారు కానీ ప్రస్తుతం మెట్పల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం బోర్డును తొలగించి రెవెన్యూ డివిజన్ కార్యాలయంగా బోర్డును ఏర్పాటు చేశారు ఇట్టి విషయమై మెట్పల్లి
సబ్ కలెక్టర్ కార్యాలయంగా బోర్డును పునర్దించి మరియు మెట్పల్లిలో ఐఏఎస్ అధికారులను ఏర్పాటు చేయాలని ప్రధాన డిమాండ్ తో మెట్పల్లి డివిజన్ ప్రజల మనో భావాలను కాపాడాలని కోరుతూ మెట్పల్లి రెవిన్యూ డివిజన్ ఏవో అధికారి విజయ లలితాకి వినతి పత్రం సమర్పించడం జరిగింది
ఈ కార్యక్రమంలో
మెట్పల్లి నియోజకవర్గ సాధన కమిటీ అధ్యక్షులు తోకల సత్యనారాయణ, గౌరవ అధ్యక్షులు గట్టయ్య, గోరుమంతుల సురేందర్, ఫోట్ట ప్రేమ్, దేశరాజ్ దేవలింగం, పుల్ల రాజా గౌడ్, గుంజేటి రాజరత్నాకర్, నీరటి రాజేందర్, అచ్చ లింగం, గంప శ్రీనివాస్, గుర్రాల విక్రమ్, సజ్జన పవన్ కుమార్, అరవింద్, పాల్గొన్నారు.