శాయంపేట నేటి ధాత్రి:
శాయంపేట మండలం మైలారం గ్రామ శివారులోని అమ్మిరెడ్డి సుధాకర్ రెడ్డి మొక్కజొన్న చేనులో వున్న ట్రాన్స్ ఫార్మర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వ్యాపించి మక్క జొన్న పొరుక అంటుకొని సుమారు 10 ఎకరాల వరకు అంటుకోగా వెంటనే శాయంపేట ఎస్సై ప్రమోద్ కుమార్ మరియు పోలీస్ కానిస్టేబుల్ సాధన్ లు మరియు చుట్టు పక్కల రైతులు సంఘటన స్థలాన్ని చేరుకొని పచ్చి పొరకాల సహాయంతో మంటలను అర్పినారు. రైతులకి ఎలాంటి నష్టం జరగలేదు. ఈ కార్యక్రమంలో ఎస్సై ప్రమోద్ కుమార్, సాధన్ చేసిన పనికి చుట్టు పక్కన రైతులు హర్షం వ్యక్తం చేశారు.