స్వామి వివేకానంద ని విద్యార్థులు ఆదర్శంగా తీసుకోవాలి-ఇంగిలి వీరేష్ రావు
పరకాల నేటిధాత్రి
స్వామి వివేకానందని విద్యార్థులు,యువత ఆదర్శంగా తీసుకోవాలని పరకాల సిటిజన్ ఫోరం మెంబర్ వీరేష్ రావు అన్నారు.
గురువారంరోజున పరకాల సిటిజన్ ఫోరం ఆధ్వర్యంలో పట్టణంలోని శారదా,లిటిల్ ఫ్లవర్,చైతన్య వివిధ పాఠశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలను పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూవిద్యార్థులు,యువత స్వామి వివేకానంద ని ఆదర్శంగాతీసుకోవాలని,చదువుతో పాటుగా పలురంగాలలో కూడా విద్యార్థులు నైపుణం పొందాలని,జీవితంలో ఏదైనా ధైర్యంతో ఎదుర్కోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.