నడికూడ,నేటి ధాత్రి:
మండల కేంద్రంలోని పాత గ్రామపంచాయతీ కార్యాలయం యందు రైతులకు పంటల పై పీచికారి ఎలా చేయాలో ఎస్సార్ యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థినిలు అవగాహన కల్పిస్తూ,మాట్లాడుతూ మందు ద్రావణం తయారు చేయడానికి శుభ్రమైన నీటిని మాత్రమే వాడాలి స్పేయర్ లోని ఫిల్టర్లను,నాజీలను, పైపులను తరచుగా శుభ్రపరుచుకోవాలని గ్రామీణ ప్రాంతంలో నిరక్ష్యరాశ్యులైన రైతాంగం,రైతు కూలీలకు పంటలకు పురుగు మందుల పిచికారీ సమయంలో సరైన అవగాహన లేకపోవటంతో జాగ్రత్తలపై ఏమాత్రం శ్రద్ధపెట్టటంలేదు.పురుగు మందుల పిచికారీ సమయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల కొన్ని సందర్భాల్లో ప్రాణాలమీదకు తెచ్చుకుంటున్నారని పంటపొలాల్లో పురుగు మందులు పిచికారీ సమయంలో రైతులు జాగ్రత్తలు పాటించటం మంచిదని పురుగుమందు పిచికారీలో సూచనలు;పురుగు మందు పిచికారి చేసే సమయంలో రక్షణగా దుస్తులు,చేతికి గ్లౌజులు, ముక్కుకి,కళ్ళకు,రక్షణగా కవచాలు ధరించాలని సస్యరక్షణ మందులు మానవ శరీరం యొక్క వివిధ భాగాల నుండి లోపలికి ప్రవేశిస్తాయి కాబట్టి రక్షణ దుస్తులు తప్పనిసరిగా వాడాలని వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి బిగుతుగా ఉండే దుస్తులను ధరించరాదని పిచికారీ చేసిన వెంటనే సబ్బుతో చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ధరించిన దుస్తులను, కవచాలను,ఉతికి ఆరబెట్టుకోవాలని ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు,గాలి వేగంగా వీస్తున్నప్పుడు,మంచు కలిగిన వాతావరణం ఉన్నప్పుడు,వర్షం కురిసే ముందు ఎలాంటి మందులు పంటలపై పిచికారి చేయరాదు. వాతావరణ పరిస్థితులను గమనించి మందు పిచికారి చేసిన తర్వాత కనీసం నాలుగు గంటల వరకు వర్షం కురవదు అని నిర్ధారణకు వస్తే మందు పిచికారి చేసుకోవాలని
మందులు పిచికారి చేసే సమయంలో నీరు త్రాగడం, ఏవైనా ఆహారాలు తినడం,గుట్కాలు నమలడం,పాన్ పరాకులు నమలడం,పొగ త్రాగడం,చేతి వేళ్లతో కళ్ళను నలపడం,చేయరాదు.అలాగే పిల్లలతో పురుగుమందుల పిచికారి చేయించకూడదని సస్యరక్షణ మందులు పిచికారి చేసిన పొలములో గాని పొలం చుట్టూ ఉన్న గట్ల పైగాని పశువులను మేపటం చేయకూడదని ఆహార పంటలపై,కూరగాయ పంటలపై,పశుగ్రాస పంటలపై,సస్యరక్షణ మందులు పిచికారి చేసినప్పుడు 8 నుండి10 రోజుల వరకు వేచిఉండి తర్వాత పంటలు కోయడం గాని కూరగాయలు కోయడం, పశుగ్రాసం కోయటం చేపట్టాలని పురుగుమందు వాడేసిన కాళీ డబ్బాలను పొలములో చిందరవందరగా వదిలేయకుండా గుంత తీసి పూడ్చి వేయాలి ప్లాస్టిక్ డబ్బాలను కాల్చివేయాలని రైతులకు ఎస్సార్ యూనివర్సిటీ అగ్రికల్చర్ విద్యార్థినీలు శ్రీలత,శరణ్య,భవాని, గాయత్రి,సింధూరావు,జోష్ణ తెలిపారు.ఈ కార్యక్రమంలో రైతులు తదితులు పాల్గొన్నారు.