Errolla Prathap Receives Honorary Doctorate
డాక్టరేట్ అందుకున్న ఎర్రోళ్ల ప్రతాప్
జహీరాబాద్ నేటి ధాత్రి:
విద్యార్థి దశ నుండి నేటి వరకు ఎన్నో సామాజిక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఝరాసంగం మండల్ బర్దిపూర్ గ్రామానికి చెందిన ఎర్రోళ్ల ప్రతాప్ కు ఆయన చేసిన సేవలను గుర్తించి ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేట్ ను రీసర్చ్ అండ్ కల్చర్ భవన్ హైదరాబాద్ నందు అందించడం జరిగింది. ఆయన చేసిన సామాజిక సేవ కార్యక్రమాలకు గుర్తింపుగా డాక్టరేట్ రావడం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని, డాక్టరేట్ రావడంతో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ అన్నారు.
ఆయన విద్యార్థి దశలో విద్యార్థుల ఎన్నో సమస్యలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థుల యొక్క విద్య సమస్యలే కాకుండా మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా తెలంగాణలో ఎన్నో వైద్య శిబిరాలను నిర్వహించి నిరుపేదలకు మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా వైద్యాన్ని అందిస్తున్నారు. సమాజంలో విద్యా వైద్యం రెండు సంపూర్ణంగా అందినప్పుడే నిరుపేదల జీవితాలు బాగుపడతాయని వారన్నారు. అటు విద్యార్థి సమస్యలపై ఇటు నిరుపేదల ఆరోగ్యాలను కాపాడడానికి మదర్ తెరిసా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
తండ్రి బాటలో తనయుడు వారి తండ్రి ఎర్రోళ్ల జయప్ప ఎన్జీవో ద్వారా దాదాపు 45 సంవత్సరాల నుండి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేశారు. వారి తండ్రి జయప్ప స్ఫూర్తి బాటలోనే తనయుడు డాక్టర్ ఎర్రోళ్ల ప్రతాప్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల గౌరవ డాక్టర్ రేట్ రావడం తో ఇంకా సామాజిక బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో బాధ్యత యుతంగా, భావి భారత పౌరునిగా తన వంతు బాధ్యతను కర్తవ్యాన్ని సంపూర్ణంగా నిర్వహిస్తానని వారన్నారు
