భూపాలపల్లి నేటిధాత్రి
మహాజన సోషలిస్ట్ పార్టీ సంతానపల్లి మండలం అధ్యక్షులుగా ఎర్ర భద్రయ్య మాదిగను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు ఎమ్మార్పీఎస్ ఎంఎస్సీ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి మాదిగ తెలిపారు ఈ సందర్భంగా చంద్రమౌళి మాదిగ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఎర్ర భద్రయ్య మాదిగ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషిస్తూ విద్యార్థి యువకులను నిరంతరం ఉద్యమం పట్ల అవగాహనతో ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ఎం ఎస్ పి పార్టీ అభివృద్ధికి నిరంతరం తోడ్పాటు అందిస్తున్న సందర్భంగా ఈ పదవిని అప్పగించడం జరిగింది ఈ సందర్భంగా ఎర్ర భద్రయ్య మాదిగ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఈ పదవి అప్పగించిన జాతీయ నాయకులు మందకుమార్ జాతీయ అధికార ప్రతినిధి బొర్రా బిక్షపతి మాజీ పొలిటి బ్యూరో సభ్యులు బొడ్డు దయాకర్ జిల్లా ఇన్చార్జి అంబాల చంద్రమౌళి జిల్లా ఉపాధ్యక్షులు దోర్నాల రాజేందర్ జిల్లా నాయకులు బుల్లి బాబుజిల్లా నాయకులు నోముల శ్రీనివాస్ నియోజకవర్గ ఇన్చార్జ్ గాజుల బిక్షపతి అంతడుపుల సురేష్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను