చిత్రపురిలో చిత్ర విచిత్ర దోపిడీ విన్యాసాలు.. ఎపిసోడ్‌-9

https://epaper.netidhatri.com/view/311/netidhathri-e-paper-6th-july-2024%09

దోషులు తప్పించుకొని…అనిల్‌ను ఇరికించి!

-సినీ కార్మికుల భూమిలో పెద్దలకు స్థలాలెందుకు?

-అసలు రో హౌజ్‌లకు పర్మిషనే లేదు.

-జీవో.నెం.658 లో చిత్రపురిలో అప్పార్ట్‌ మెంట్‌ ఫ్లాట్స్‌కు మాత్రమే పర్మిషన్‌ ఉంది

-14 ఎకరాలు అక్రమంగా ఆక్రమించి రో హౌస్‌లు ఎలా కట్టుకున్నారు.

-రో హౌస్‌ల స్థానంలో కనీసం 2 వేల ఫ్లట్స్‌ నిర్మాణం చేయొచ్చు.

-ట్విన్‌ టవర్స్‌ తో పాటు, 14 ఎకరాల్లో అప్పార్టుమెంట్లు కట్టాలి.

-ఉన్న ఫలంగా ‘‘కాదంబరి’’ అమెరికా ఎందుకు చెక్కేసినట్లు!

-నెపం ‘‘అనిల్‌’’ మీద నెట్టి తప్పించుకోవాలనుకుంటున్నదెవరు!

-రో హౌజ్‌ల కేటాయింపు సమయంలో అనిల్‌ కుర్చీలో లేరు.

-రో హౌజ్‌లకు సంబంధించిన అంశానికి అనిల్‌కు సంబంధం లేదు.

-దొంగలు దొంగలు స్థలాలు పంచుకొని రో హౌస్‌లు కట్టుకున్నారు.

-ప్రత్యేక ఇళ్ల నిర్మాణం చేపట్టడానికి వీలు లేదు.

-పెద్దలే గద్దలు..కార్మికులు సమిధలు!

-‘‘అనిల్‌’’ను ‘‘బలికా బక్‌రా’’ చేసిందెవరు?

-అసలు ‘‘అనిల్‌’’ను ఇరికించిందెవరు?

-ఇరవై ఏళ్ల చెలామణి సుద్దపూసలెవరు?

-‘‘అనిల్‌’’ను ముందు పెట్టి నాటకాలాడిరదెవరు!

-గద్దలు ఇటు రో హౌస్‌లు అటు ఫ్లాట్లు కొట్టేశారు.

-ఒక్కక్కరు పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఎలా తీసుకున్నారు!

-కార్మికులందరికీ న్యాయం చేయొచ్చు!

-సమాధానాలు చెప్పాల్సిన సమయంలో ఎందుకు పారిపోయినట్లు!

-అనిల్‌ ప్రశ్నలకు జవాబులు ఎందుకివ్వలేదు!

-రో హౌస్‌లు తీసుకున్న వారు తేలుకుట్టిన దొంగలయ్యారు.

-పర్మిషన్‌ లేని రో హౌస్‌ల కూల్చివేతలు ఎవరు అడ్డుకుంటున్నారు!

-కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాకుండా అడ్డు పడుతున్నదెవరు?

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టుకోలేడని పెద్దలు చెప్పారు. ఇప్పుడు చిత్రపురి విషయంలోనూ అదే జరుగుతోంది. చిత్రపురి సొసైటీ చైర్మనైన పాపానికి చేయాల్సిందా చేసిన పెద్దలు తప్పుకున్నారు. ఏ పాపం తెలియని వల్లభనేని అనిల్‌ కుమార్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అసలు చిత్రపురి సొసైటీలో ఏం జరిగింది? ఏం జరుగుతోందన్నది తెలియని వాళ్లంతా మాట్లాడుతున్నారు. ఏవేవో విమర్శలు చేస్తున్నారు. అసలు నిజాలు తెలుసుకోవాలన్న ఆలోచన ఏ ఒక్కరిలో లేదు. ఎంత సేపు ఏదొ ఒకటి మాట్లాడాలి. సొసైటీని ఇరుకున పెట్టాలి. అనిల్‌ను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచనే చేస్తున్నారు. అసలు చిత్రపురిలో అవకవకలు జరగలేదని అనిల్‌ కూడా చెప్పడం లేదు. జరిగిన అవకతవకలు తన హయాంలో జరిగినవి కాదు. వాటిని సరిదిద్దే అధికారం అనిల్‌కు లేదు. ఇప్పటికైనా కార్మికులకు న్యాయం చేయాలన్న సంకల్పంతో అనిల్‌ ఎంతో కష్టపడుతుంటే కొంత మంది అనవసర రాద్దాంతం చేస్తున్నారు. గతంలో తప్పులు చేసి, తమ ఇష్టానుసారం వ్యవహరించిన వాళ్లు ఇప్పుడు తమ పప్పులు ఉడకడం లేదని వివాదాలు సృష్టిస్తున్నారు. వాళ్ల పేర్లు బైటకు రాకుండా అనిల్‌ ను ముందు పెడుతున్నారు. పెద్దలే గద్దలు…కార్మికులు సమిధలు! ఈ విషయంలో ఎలాగైనా కార్మికులకు కచ్చితంగా న్యాయం చేయాలన్న పట్టుదలతో వల్లభనేని అనిల్‌ వున్నారు. కానీ కొంత మంది సోకాల్డ్‌ పెద్దలు అనిల్‌ ను ముందుకు వెళ్లనివ్వడం లేదు. కార్మికులకు న్యాయం జరగాలని ఆ పెద్దలకు లేదు. అందుకే ఇదంతా చేస్తున్నారు. ఆఖరకు అనిల్‌ ను బలికా బకరా చేయాలని పన్నాగం పన్నారు. కొంతమందిని ఎగదోసి కొన్నేళ్లుగా సొసైటీని అబాసుపాలు చేస్తున్నారు. కార్మికులలో అభద్రతా భావం పురిగొల్పుతున్నారు. ఇక్కడ మరో విషయమేమిటంటే అసలైన దోషులు దోషులు తప్పించుకొని తిరుగుతున్నారు. చైర్మన్‌ అనిల్‌ను ఇరికించి చేతులు కడుక్కుందామని చూస్తున్నారు. అసలు చిత్రపురికి అర్థం మార్చేస్తున్నారు. చిత్రపురిలో కార్మికులకు చోటు లేకుండా చేయాలని కుట్ర చేశారు. పైకి మాత్రం కార్మికులపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. నిజంగా అంత గొప్ప గుణమే వుంటే వాళ్లకు చిత్రపురిలో ఇళ్లెందుకు? ఫ్లాట్స్‌ ఎందుకు తీసున్నారు? అనుయాయుల పేరుతో ఇష్టం వచ్చినట్లు ఫ్లాట్లు ఎలా పంచుకున్నారు. నిజంగానే వారిది గొప్ప మనసైతే రో హౌస్‌ లెందుకు? కార్మికుల భూమిలో విల్లాలను తలదన్నేటు వంటి రో హౌస్‌ లు ఎందుకు కట్టుకున్నారు. కార్మిక పక్షపాతులైతే రో హౌస్‌ లన్నీ సొసైటీ పరం చేయండి. అసలు రో హౌస్‌ ల నిర్మాణం చట్ట విరుద్ధం. అక్కడ ప్రత్యేకమైన ఇళ్ల నిర్మాణం చేపట్టకూడదు. ప్రభుత్వం ఇచ్చిన జివో. 658 ప్రకారం మొత్తం చిత్రపురి సొసైటీ స్థలంలో కేవలం ఫ్లాట్స్‌ మాత్రమే నిర్మాణం చేయాలి. కానీ కొంత మంది పెద్దలు రో హౌస్‌ లు నిర్మాణం చేసుకున్నారు. అయితే రో హౌజ్‌ల కేటాయింపు సమయంలో అనిల్‌ కుర్చీలో లేరు. అసలు ఈ రో హౌస్‌ ల అంశం అనిల్‌ కు సంబంధం లేదు. రో హౌస్‌ ల నిర్మాణం వెనుక సొసైటీ లేదు. ఈ విషయం తెలియక చాలా మంది అపోహ పడుతున్నారు. ఎవరో చెప్పిన మాటలు నమ్మి సొసైటీ మీద బురద జల్లుతున్నారు. ప్రత్యేకంగా అనిల్‌ మీద ఆరోపణలు చేస్తున్నారు. రో హౌజ్‌లకు సంబంధించిన అంశానికి అనిల్‌కు సంబంధం లేదు. ఆయన కూడా ఇదే విషయాన్ని పదే పదే చెబుతున్నా చాలా మంది వినిపించుకోవడం లేదు. ఎంత సేపు కొంతమంది చెప్పిన మాటలే పట్డుకుంటున్నారు. ఆ చెప్పే వారందరికీ, సొసైటీపై విమర్శలు చేయాలని ఉసి గొల్పుతున్న వారందరికీ రో హౌస్‌ లున్నాయి. రో హౌస్‌ లన్నీ తీసేయ్యాలి. 14 ఎకరాల స్థలాన్ని 200 మంది చేతుల్లోకి వెళ్లడం అనిల్‌ కు సుతారం ఇష్టం లేదు. రో హౌస్‌ లన్నవి అక్రమ నిర్మాణాలు. వాటిని కూల్చేసి ఆ స్థలంలో కార్మికులకు కనీసం 2000 ఫ్లాట్స్‌ నిర్మాణం చేయొచ్చు. కార్మికులందరికీ న్యాయం చేయొచ్చన్నదే అనిల్‌ ఆలోచన. దానిని పసిగట్టిన పెద్దలు ఎలాగైనా అనిల్‌ ను తప్పించాలని కుట్రకు తెరతీశారు. ఇలాంటి కుట్రలు ఎదురౌతాయని అనిల్‌ కు సైతం తెలుసు. అందుకే అన్ని విషయాలు బైట పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆగష్టు నెల మొదటి వారం సొసైటీ సర్వ సభ్య సమావేశం ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. అసలు నిజానిజాలు అప్పుడు బైట పడతాయని ధీమాగా వున్నారు. దొంగలు దొంగలు స్థలాలు పంచుకొని రో హౌస్‌లు కట్టుకున్నారు. ఇప్పుడు అనిల్‌ మీదకు కార్మికులను ఎగదోస్తున్నారు. ఇక్కడ అందరూ గమనించాల్సిన విషయమేమిటంటే అసలు రో హౌజ్‌లకు పర్మిషనే లేదు. ఒకరి తర్వాత ఒకరు తమ ఇష్టానుసారం రో హౌస్‌ లు నిర్మాణం చేసుకున్నారు. తమను అడ్డుకునే శక్తి కార్మికులకు లేదని వారికి తెలుసు. ప్రభుత్వాలు కూడా ఏ చర్చలైనా తమతోనే చేస్తాయన్న ధీమా! కార్మికులను పిలిపించుకొని ఇంతవరకు పదేళ్లలో గత ప్రభుత్వ పెద్దలు మాట్లాడిరది లేదు. కార్మికులను పెనం మీద నుంచి పొయ్యిలో వేశారే గాని అండగా వుండలేదు. న్యాయం చేయలేదు. పైగా కార్మికులకు పెద్దలతో గొడవెందుకు అని హిత బోధ చేసి పంపించారు. కార్మికులు సమస్యలు చెప్పుకోడానికి వెళ్లి సందర్భంలో అసలు విషయాలు తెలుసుకొని అప్పటి ప్రభుత్వ కీలక నాయకులు కూడా రో హౌస్‌ లు దక్కించుకున్నారు. కంచే చేను మేస్తే చెప్పుకునే దిక్కు వుంటుందా? కొత్త ప్రభుత్వం వచ్చింది. చొరవ తీసుకొని రో హౌస్‌ ల వ్యవహారంపై దృష్టి పెడితే బిఆర్‌ఎస్‌ నాయకుల భండారం కూడా బైటపడుతుంది. అంతే కాకుండా సొసైటీని గుప్పిట్లో పెట్టుకొని కొంతమంది పదుల సంఖ్యలో ఫ్లాట్స్‌ కొనుగోలు చేశారు. కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారు. అలా తీసుకున్న వారి భండారం కూడా బయటపడే సమయం ఆసన్నమైంది. అందులో కార్మికుల సంక్షేమం అంటూ కథలు చెప్పే కాదంబరి కిరణ్‌ కుమార్‌ కు ఎన్ని రో హౌస్‌ లున్నాయో! ఆయనే చెప్పాల్సిన అవసరం వుంది. లేకుంటే సొసైటీ సర్వసభ్య సమావేశంలో అనిల్‌ వెల్లడిరడానికి సిద్ధంగా వున్నారు. వినోద్‌ బాలకు ఎన్ని ఫ్లాట్స్‌ వున్నాయో! ఎన్ని రో హౌస్‌ లున్నాయో! ఆగష్టు లో వెలుగులోకి రానుంది. ఇలా పోలీసు కేసులను తప్పించుకునేందుకు, బెయిల్‌ పై బైట వున్న వారందరి బాగోతాలు వెల్లడికానున్నాయి. ఇక వీటి లెక్కలు బయటకు రాకుండా అడ్డుకున్న టిఆర్‌ఎస్‌ నాయకుల సంగతి కూడా తేలనుంది. పెద్ద మనుషుల వేషంలో ఇలా కార్మికుల కష్టం దోచుకొని సోకులు పోతున్న వారి అసలు నిజ స్వరూపాలు బైటపడనున్నాయి. ఒక్కక్కరు పదుల సంఖ్యలో ఫ్లాట్లు ఎలా తీసుకున్నారు! అన్న సంగతి సొసైటీ సభ్యులంది ముందు పెడితే గాని ప్రక్షాళన జరగదు. కార్మికులకు న్యాయం జరగదు. అందుకే రో హౌస్‌ అన్నింటినీ స్వాధీనం చేయాల్సిన అవసరం వుంది. 14 ఎకరాల భూమిని తమ గుప్పిట్లో పెట్టుకొని రో హౌస్‌ లు నిర్మించుకొని, చిలకపలుకులు పలుకుతున్న వారి సంగతి సొసైటీ సభ్యులే చూసుకుంటారు. చేయాల్సిందంతా చేసి, అనిల్‌ ను ఇరికించి తప్పించుకోవాలని చూశారు. అనిల్‌ ని భయపెట్టాలని చూశారు. రో హౌస్‌ల స్థానంలో కనీసం 2 వేల ఫ్లట్స్‌ నిర్మాణం చేయొచ్చని ఎప్పుడైతే అనిల్‌ ప్రతిపాదన తెచ్చారో అప్పటి నుండి అనిల్‌ పై కక్ష్య కట్టారు. అనిల్‌ ను తప్పించాలని ఎత్తుగడ వేశారు. అనిల్‌ అడ్డు తొలగిస్తే అడిగే వారుండరని రాజకీయం చేశారు. అనిల్‌ ను సొసైటీ చైర్మన్‌ పదవి నుంచి తప్పించి, ఇతరులను తెచ్చి పెడితే ఇక ఆ సమస్యకు పుల్‌ స్టాప్‌ పెట్టొచ్చని అనుకున్నారు. కానీ కార్మికులందరికీ న్యాయం చేయాలన్న పట్టుదలతో వున్న అని కచ్చితంగా న్యాయం చేయాలన్న బలమైన సంకల్పంతో వున్నారు. ట్విన్‌ టవర్స్‌ తో పాటు, 14 ఎకరాలు అప్పార్టుమెంట్లు కట్టాలని గట్టిగా కొట్లాడుతున్నాడు. అనిల్‌ బెయిల్‌ మీద రావడంతో కొంత మంది లో వణుకు మొదలైంది. అది చిలికి చిలికి గాలి వానయ్యేలా వుందని వారిలో భయం పట్టుకున్నది. ఇప్పటి వరకు కొంతమందిని సొసైటీ మీదకు ఎగదోసిన కాదంబరి కిరణ్‌ కుమార్‌ అమెరికా వెళ్లినట్లు సమాచారం. బెయిల్‌ పై వున్న వారు కోర్టు అనుమతితో మాత్రమే వెళ్లాలి. మరి అనుమతి తీసుకున్నారా! లేదా తెలియాల్సి వుంది. ఆగష్టులో తన నిజ స్వరూపం బట్ట బయలౌతుందన్న అనుమానంతో అమెరికా చెక్కేశాడని కొంత మంది అంటున్నారు. ఇటీవల అనిల్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి చాలా విషయాలు వెల్లడిరచారు. దాంతో పాలుపోని పరిస్థితి ఏర్పడిరది. సమాధానాలు చెప్పాల్సిన సమయంలో ఎందుకు కాదంబరి పారిపోయినట్లు! అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. కాకపోతే అక్రమంగా రో హౌస్‌ లు నిర్మాణం చేసుకున్న వారు తేలుకుట్టిన దొంగలయ్యారు. అందరూ ఎక్కడిక్కడ గప్‌ చుప్‌ అయ్యారు. ఇక్కడ మరి కొన్ని విషయాలపై స్పష్టత రావాల్సివుంది. పర్మిషన్‌ లేని రో హౌస్‌ల కూల్చివేతలు ఎవరు అడ్డుకుంటున్నారు! కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీ అమలు కాకుండా అడ్డు పడుతున్నదెవరు? తేలితే కార్మికులకు న్యాయం జరగడం ఖాయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *