ఆర్ట్స్ కళాశాలలో పరిసరాల పరిశుభ్రత

సుబేదారి
యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్ఎస్ఎస్ మరియు కెమిస్ట్రీ విభాగం ఆధ్వర్యంలో శనివారం పరిసరాలు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఆర్ట్స్ కళాశాల ఆవరణలో పేరుకపోయిన చెత్తా చెదారాన్ని తీసివేసి పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య జ్యోతి మాట్లాడుతూ ప్రతి శనివారం కళాశాల ఆవరణలో గల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ శ్రీదేవి, డాక్టర్ ఉషారాణి, డాక్టర్ రమేష్, డాక్టర్ దేవేందర్, రాజు సతీష్ మరియు కెమిస్ట్రీ విభాగ విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!