
ఎమ్మెల్యేకు కారల్ మార్క్స్ నగర్ వాసుల విజ్ఞప్తి
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ పరిధిలోని కారల్ మార్క్స్ నగర్ సమీపంలో నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజ్ లో స్థానికులకే ఉపాధి అవకాశాలు కలిగేలా చూడాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం కారల్ మర్క్స్ నగర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాంగరపు బాబు ఆధ్వర్యంలో కాలనీవాసులు వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్ నాగరాజు ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ తమ కాలనీవాసులకు సరైన ఉపాధి అవకాశాలు లేకపోవడంతో సుదూర ప్రాంతాలకు వెళుతున్నారని కాబట్టి తమ కాలనీ పక్కన నిర్మిస్తున్న ఆదిత్య కోల్డ్ స్టోరేజీలో తమకు అవకాశాలు కల్పించేలా చూడాలని ఎమ్మెల్యేని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరెపల్లి లింగస్వామి, ఎలికట్టె బాబు, ఎస్.కె అఫ్సల్, చుక్క ఏసు, ఎర్ర యాకయ్య, హమాలీ కార్మికులు, తదితరులు పాల్గొన్నారు.