జిల్లా ఆరోగ్య వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్
కాటారం నేటి ధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున పీహెచ్ సీలో ఓఆర్ ఎస్ ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ మధుసూదన్ సూచించారు. సోమవారం కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యశాలను వారు సందర్శించారు. 100 రోజుల పని చేయు చోట, వరి కోనుగోలు కేంద్రాల్లో ఓఆర్ ఎస్ అందుబాటు లో ఉండేలా చూడాలని మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మౌనిక కి సూచించారు. వారితోపాటు ఆరోగ్య సిబ్బంది, తదితరులు ఉన్నారు.