
India vs England 4th Test:
నిలబెడతారా……
నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ సున్నాకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్ వరకైనా నిలుస్తుందా? అనిపించింది. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్…
- రాహుల్, గిల్ అజేయ అర్ధసెంచరీలు
- పోరాడుతున్న టీమిండియా
- రెండో ఇన్నింగ్స్ 174/2
- ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ 669
- బెన్ స్టోక్స్ సెంచరీ
- నాలుగో టెస్టు
మాంచెస్టర్: నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌కు దక్కిన ఆధిక్యం 311. అటు రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ సున్నాకే రెండు వికెట్లు కోల్పోవడంతో ఆఖరి సెషన్ వరకైనా నిలుస్తుందా? అనిపించింది. కానీ ఓపెనర్ కేఎల్ రాహుల్ (210 బంతుల్లో 8 ఫోర్లతో 87 బ్యాటింగ్), కెప్టెన్ గిల్ (167 బంతుల్లో 10 ఫోర్లతో 78 బ్యాటింగ్) మాత్రం పట్టువదలని పోరాటంతో అబ్బుర పరిచారు. రెండు సెషన్లపాటు ఓపిగ్గా క్రీజులో నిలిచి భారత్ డ్రాపై ఆశలను సజీవంగా నిలిపారు. దీంతో శనివారం నాలుగో రోజు ఆట ముగిసేసరికి భారత్ 63 ఓవర్లలో 174/2 స్కోరు చేసింది. ఇంకా జట్టు 137 రన్స్ వెనుకబడి ఉండగా.. చేతిలో ఎనిమిది వికెట్లున్నాయి. గెలుపు అసాధ్యమే కనుక చివరి రోజు మూడు సెషన్లపాటు ఆతిథ్య జట్టు బౌలర్లను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అటు పంత్ బ్యాటింగ్‌పైనా స్పష్టత రావాల్సి ఉంది. అంతకుముందు బెన్ స్టోక్స్ (141) శతక సహాయంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసింది. కార్స్ (47) రాణించాడు. జడేజాకు నాలుగు.. సుందర్, బుమ్రాలకు రెండేసి వికెట్లు దక్కాయి.
అద్భుత భాగస్వామ్యం: 544/7 ఓవర్‌నైట్ స్కోరుతో నాలుగో రోజును ఆరంభించిన ఇంగ్లండ్ దాదాపు సెషన్ పూర్తిగా ఆడి మిగిలిన మూడు వికెట్లను కోల్పోయింది. కానీ ఆలోపే కెప్టెన్ స్టోక్స్ శతకంతో పాటు కార్స్ ధాటికి మరో 125 పరుగులు జత చేరాయి. ఈ జోడీ మధ్య తొమ్మిదో వికెట్‌కు 95 పరుగులు జత చేరడం విశేషం. దీంతో స్కోరు 600 దాటడంతోపాటు ఆధిక్యం 311కి చేరి భారత్ ముందు కఠిన సవాల్‌ను ఉంచింది. పేసర్లు బుమ్రా, సిరాజ్ ఈసారి కాస్త మెరుగ్గానే బౌలింగ్ చేసినా ఇంగ్లండ్ జోరును కట్టడి చేయలేకపోయారు. డాసన్ (26) నిష్క్రమించాక కార్స్ అండతో స్టోక్స్ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపించాడు. సిరాజ్ ఓవర్లో ఫోర్‌తో అతడు రెండేళ్ల తర్వాత శతకం అందుకున్నాడు. స్పిన్నర్లు సుందర్, జడేజా ఓవర్లలో ఒక్కో ఫోర్, సిక్సర్‌తో ధాటిని కనబర్చాడు. అటు కార్స్ కూడా వేగంగా ఆడి తన వంతు సహకారం అందించాడు. చివరకు జడేజా తన వరుస ఓవర్లలో స్టోక్స్, కార్స్‌లను అవుట్ చేసి ఇంగ్లండ్ అద్భుత ఇన్నింగ్స్‌ను ముగించాడు.
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలే (సి) రాహుల్ (బి) జడేజా 84, డకెట్ (సి/సబ్) జురెల్ (బి) అన్షుల్ 94, పోప్ (సి) రాహుల్ (బి) సుందర్ 71, రూట్ (స్టంప్ సబ్) జురెల్ (బి) జడేజా 150, బ్రూక్ (స్టంప్ సబ్) జురెల్ (బి) సుందర్ 3, స్టోక్స్ (సి) సుదర్శన్ (బి) జడేజా 141, స్మిత్ (సి సబ్) జురెల్ (బి) బుమ్రా 9, డాసన్ (బి) బుమ్రా 26, వోక్స్ (బి) సిరాజ్ 4, కార్స్ (సి) సిరాజ్ (బి) జడేజా 47, ఆర్చర్ (నాటౌట్) 2, ఎక్స్‌ట్రాలు: 38; మొత్తం: 157.1 ఓవర్లలో 669 ఆలౌట్; వికెట్ల పతనం: 1-166, 2-197, 3-341, 4-349, 5-499, 6-515, 7-528, 8-563, 9-658, 10-669; బౌలింగ్: బుమ్రా 33-5-112-2, అన్షుల్ 18-1-89-1, సిరాజ్ 30-4-140-1, శార్దూల్ 11-0-55-0, జడేజా 37.1-0-143-4, సుందర్ 28-4-107-2.
భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) రూట్ (బి) వోక్స్ 0, రాహుల్ (బ్యాటింగ్) 87, సుదర్శన్ (సి) బ్రూక్ (బి) వోక్స్ 0, గిల్ (బ్యాటింగ్) 78, ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 63 ఓవర్లలో 174/2; వికెట్ల పతనం: 1-0, 2-0; బౌలింగ్: వోక్స్ 15-3-48-2, ఆర్చర్ 11-2-40-0, కార్స్ 10-2-29-0, డాసన్ 22-8-36-0, రూట్ 5-1-17-0.
- ఇంగ్లండ్‌లో టెస్టు సిరీ్‌సలో ఎక్కువ పరుగులు (697) సాధించిన ఆసియా బ్యాటర్‌గా గిల్. మహ్మద్ యూసుఫ్ (2006లో 631)ను అధిగమించాడు.
- ఓ ఇన్నింగ్స్‌లో వందకు పైగా పరుగులు సమర్పించుకోవడం బుమ్రాకిదే తొలిసారి.
- టెస్టుల్లో ఓ జట్టు సున్నాకే రెండు వికెట్లు కోల్పోయినా మూడో వికెట్‌కు అధిక భాగస్వామ్యం (174) నమోదు చేసిన జోడీగా గిల్-రాహుల్.
- ఓల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో అత్యధిక స్కోరు (669) సాధించిన జట్టుగా ఇంగ్లండ్.