నేటిధాత్రి, వరంగల్
తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో ఏప్రియల్ 14 నుండి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అగ్ని ప్రమాదాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల పైన ప్రజల్లో అవగాహన కోసం వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమం వరంగల్ ఫైర్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ మాట్లాడుతూ, అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే 101కు సమాచారం ఇవ్వాలని, ఫైర్ సేఫ్టీ అనేది చాలా ముఖ్యమైన అంశం అని, ఇటీవల జరిగిన పోచంమైదాన్ జకోటియ కాంప్లెక్స్ లో జరిగిన అగ్నిప్రమాదంలో వెను వెంటనే స్పందించిన మట్ట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపీని ఈ సందర్భంగా సెంట్రల్ జోన్ డీసీపీ అబ్దుల్ భారీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ అధికారి మామిడి భగవాన్ రెడ్డి, వరంగల్ ఏసిపి నందిరాం నాయక్, మట్ట్వాడ పోలీస్ ఇన్స్పెక్టర్ గోపి, అగ్నిమాపక సహాయక అధికారి జయపాల్ రెడ్డి, వరంగల్, హనుమకొండ జిల్లాల ఫైర్ అధికారులు రవీందర్, నాగరాజు, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.