ఉపాధి కూలీలకు పనులు కల్పించాలి.
పనుల వద్ద సౌకర్యాలు కల్పించకుంటే చర్యలు తప్పవు
వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
దుగ్గొండి మండలంలో ఉపాధి పనుల పరిశీలన.
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:

గ్రామాల్లో అర్హత గల ప్రజలకు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనులు కల్పించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.శుక్రవారం దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
అధికారులతో కలిసి మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఉపాధి హామీ కూలీలలతో మమేకమై ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ.. అడిగి తెలుసుకున్నారు.కర్ణాలకుంటలో చేపడుతున్న ఈజీఎస్ పనుల ద్వారా నిర్మిస్తున్న ఫోమ్ ఫండ్ తవ్వకాల పనులను కలెక్టర్ పరిశీలించారు.పనులు చేసే సందర్భంలో కూలీలకు సరైన సౌకర్యాలు కల్పించాలని అర్హులందరికీ ఉపాధి పనులు కల్పించాలని ఆదేశించారు.అనంతరం చాపలబండ తండలో ఈజీఎస్ పథకం క్రింద నాగపురి రాజేందర్ అనే రైతు ఎకరం భూమిలో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేయగా పరిశీలించి,సాగు విధానాన్ని తెలుసుకొన్న జిల్లా కలెక్టర్ ప్రశంసించారు.రాబోయే రోజుల్లో వ్యవసాయ రంగంలో మరింతగా ముందుకెళ్లాలని రైతుకు సూచించారు. ఉపాధి పనులలో ఎవరైనా అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ కౌశల్య దేవి జడ్పిసిఓ రామిరెడ్డి,ఎంపీడీఓ అరుంధతి,ఎంపీఓ
శ్రీదర్ గౌడ్,ఏపీఓ శ్రీనివాస్,ఈసీ రాజు, టి.ఏ రాజు,బద్రు,పంచాయతీ కార్యదర్శి రాజమౌళి ఫీల్ అసిస్టెంట్ సుమలత,సంబంధిత అధికారులు పాల్గొన్నారు.