తనిఖీ చేసిన జడ్పీ సీఈవో.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని
చిట్యాల, చల్లగరిగ, గ్రామ పంచాయతిల పరిధిలోని మామిడి కుంటలో మరియు ఊరచెరువు లో జరుగుతున్న ఉపాధి హామీ పనులైన ఫిష్ బ్రీడింగ్ పాండ్స్ పనులను గురువారం రోజున జిల్లా పరిషత్ సీఈ వో విజయలక్ష్మి తనిఖీ చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆమె కూలీలతో మాట్లాడుతూ ఉదయం పూట పనికి వచ్చి కొలతల ప్రకారం పని చేస్తే రోజుకు 300 రూపాయలు వస్తాయని చెప్పడం జరిగింది. అలాగే వీరి వెంట ఏపీవో అలీమ్, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శి రవికుమార్, ఫీల్డ్ అసిస్టెంట్లు మేట్సు,తదితరులున్నారు ఉన్నారు.