Mandatory KYC for NREGA Workers
ఉపాధి హామీ కూలీలు తప్పనిసరిగా కేవైసీ చేయించుకోవాలి
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో 100 రోజుల ఉపాధి హామీ జాబ్ కార్డులు కలిగిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కేవైసీ అప్డేషన్ చేయించు కోవాలని మండల ఏపీవో రాజ్ కుమార్ సూచించారు.మండల పరిషత్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ, కేవైసీ అప్డేట్ చేయని కూలీలు ఇకపై ఉపాధి హామీ పథకం కింద పనులు పొందడం లేదా పనులకు హాజరు కావడం సాధ్యం కాదని తెలిపారు. అలాగే అట్టి కూలీలకు వ్యక్తిగత పనులకు సాంక్షన్ ఇవ్వడం కూడా కుదరదని స్పష్టం చేశారు. ప్రతి జాబ్ కార్డు దారుడు తమ ఝరాసంగం గ్రామ పంచాయతీ ఫీల్డ్ అసిస్టెంట్ నర్సింలు ను సంప్రదించి వెంటనే కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. చనిపోయిన వ్యక్తుల పేర్లు, వివాహం అయి అత్తగారింటికి వెళ్లిన మహిళల పేర్లు వంటి వివరాలను ఫీల్డ్ అసిస్టెంట్‌కి తెలియజేసి జాబ్ కార్డుల నుండి తొలగించుకోవాలని సూచించారు. గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు కూలీలకు అందుబాటులో ఉండి కేవైసీ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు.
