Gram Sabha MPO Sripathi Babu Rao
ముదిగుంట లో ఉపాధి హామీ గ్రామసభ
జైపూర్, నేటిధాత్రి:
ముదిగుంట గ్రామపంచాయతీ లో ఉపాధి హామీ గ్రామసభ ఎంపీవో శ్రీపతి బాబురావు బుధవారం నిర్వహించారు. అలాగే గ్రామపంచాయతీ లో 2026 -27 ఆర్థిక సంవత్సరానికి చేపట్టబోయే ఉపాధి హామీ పనుల వివరాలు తెలిపారు.ఈజీఎస్ లో చేపట్టవలసిన పనులు పశువుల పాక,కోళ్ల షెడ్డు, అజోల్లా,నాడెపు కంపోస్ట్ పిట్, మట్టి రోడ్డు నిర్మాణం,చిన్న ఊట కుంటలు,ఫారం ఫండ్, మామిడి తోటల పెంపకం, ఫారెస్ట్ కందకాలు,కొబ్బరి తోటల పెంపకం చేపట్టాలని సూచించారు.అనంతరం మొబైల్ యాప్ తనిఖీ నిర్వహించి సానిటేషన్ పనులు చేపట్టి,100% ఇంటి పన్నులు త్వరగా పూర్తి చేయాలని,ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పూర్తి చేసుకోవాలని అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎంపీఓ శ్రీపతి బాబురావు,పంచాయతీ కార్యదర్శి సురేష్, టెక్నికల్ అసిస్టెంట్ శిరీష,ఫీల్డ్ అసిస్టెంట్ సువర్ణ,ఉపాధి హామీ సిబ్బంది,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
