ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం

గణపురం నేటి ధాత్రి

జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో 2024- 25 ఆర్థిక సంవత్సరం మార్చి నెలలో ఉపాధి హామీ పనులు మొదలై జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో ఉపాధి హామీ పనిలో భాగంగా నాలుగు వారాలు మాస్టర్ లో అనేక అవకతవకలు జరిగాయని స్వయంగా వేతన దారులే ఈ అవినీతి బాగోతాన్ని బయటపెట్టారు.మరి ముఖ్యంగా నిరుపేదలకు చేతినిండా పని కల్పించి వారు నిశ్చింతగా జీవించేందుకు ఉద్దేశించిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. పని చేసిన వారికి దక్కాల్సిన ఉపాధి నిధులు పనికిరాని వారి పేరున జమవుతున్నాయని, ఎప్పుడు కూలికి వెళ్లని గృహిణిల పేరున వేలకు వేల రూపాయలు బ్యాంక్ అకౌంట్ లో జమవుతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు 50 మందికి పైగా పనులు చేయకుండానే ఉపాధి కూలీలుగా రికార్డులలో నమోదు అవుతుండగా బ్యాంక్ అకౌంట్ లో వేలకు వేల రూపాయలు జమవుతున్నాయి. పనికి రానికి వారికి ఎంతో కొంత డబ్బు ఇచ్చి మిగతా మొత్తాన్ని క్షేత్ర సహాయకుడు కాజేస్తున్నాడని వేతన దారులు ఆరోపిస్తున్నారు.జాబ్ కార్డు ఉండి కూడా సంవత్సరాల తరబడి పని లేక అధికారుల చుట్టూ తిరుగుతున్న అభాగ్యులు ఎందరో ఉన్న వారికి పని కల్పించడం లేదు బంధుత్వాన్ని, స్నేహాన్ని అడ్డుపెట్టుకొని కావలసిన వారికి, పనికి రానివారికి మాస్టర్లో హాజరు వేయడంతో పని చేసిన వారి శ్రమకు తగ్గ ఫలితంగా దక్కకుండా పోతుందని అలాగే ప్రస్తుతం క్షేత్ర సహాయకుడిగా పని చేస్తున్న వ్యక్తి గతంలో సస్పెండ్ అయిన మళ్లీ ఆయనకే అధికారులు ఆకాశం కల్పించడంతో పెట్రేగిపోతున్నాడని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి క్షేత్ర సహాయకుడిపై విచారణ చేపట్టి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని వేతనదారులు కోరుతున్నారు
ఇదిగో అవినీతి: ఉపాధి హామీ పనికి రాకున్నా ఉపాధి కూలీలుగా పని చేసినట్లుగ, హాజరు వేసిన జాబ్ కార్డుల వివరాలు 20091,20124,20189,20191,20195,20234,20292,20611,20613,23233 మరియు ఇవే కాకుండా ఇంకా అనేక జాబ్ కార్డు లో ఉపాధి హామీ పని చేయకుండా కూడా డబ్బులు జమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *