జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా
భూపాలపల్లి నేటిధాత్రి
శుక్రవారం ఐడిఓసి కార్యాలయపు సమావేశపు హాలులో మంచినీటి సరఫరా, అమ్మ ఆదర్శ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పన, గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనులు, ఉపాధి హామీ పధకం పనులు తదితర అంశాలపై ఎంపిడీవోలు, డిపివోలు, మండల ప్రత్యేక అధికారులు, పంచాయతి రాజ్, గిరిజన సంక్షేమ,
టి ఎస్ ఈ డబ్ల్యూ ఐడిసి ఇంజినీరింగ్, పంచాయతి క విద్యా శాఖ, పంచాయతీ కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల గణపురం మండలం, కరకపల్లి గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న పల్లెబోయిన శ్రావణి మరణానికి శ్రద్ధాంజలి ఘటించి, రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ బయం, దిగులుతో సమస్యలు అధిక మవుతాయని, వాటన్నిటినీ అధిగమిస్తూ ధైర్యంగా జీవించాలని అన్నారు.
విధుల నిర్వహణలో ఏదేని సమస్య వస్తే ఎంపిడిఓ, డిపిఓ దృష్టికి తేవాలని అక్కడ పరిష్కారం కాని పక్షంలో నేరుగా తనకు తెలియ చేయాలని అన్నారు. ప్రతి రోజు సాయంత్రం 4-7 గంటల వరకు కలెక్టరేట్ నందు అందుబాటులో ఉంటానని కార్యదర్శులు నేరుగా కలసి సమస్యను చెప్పాలని తెలిపారు. సమస్యను మనలోనే దాచుకుని మదన పడటం వల్ల అది అనేక రుగ్మతలకు దారి తీస్తుందని, తద్వారా మనసులో మానసిక సంఘర్షణ జరిగి ఆత్మహత్యల వైపు నడిపిస్తుందని అన్నారు. ఎలాంటి బిడియం లేకుండా
నిస్సంకోచంగా తెలియచేయడం వల్ల వత్తిడి తగ్గి మనసు ప్రశాంతత సంతరించుకుంతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ సిబ్బంది విధుల పట్ల సమగ్రమైన అవగాహన కలిగి ఉండాలని, నిధులు మంజూరులో అత్యన్త జాగ్రత్తగా ఉండాలని అన్నారు. విధుల పట్ల క్రమశిక్షణ, అంకితభావం కలిగి ఉండాలని, మానసికంగా కృంగిపోయి క్షణికావేశంలో అఘాయిత్యాలకు పాల్పడి విలువైన ప్రాణాలను తీసుకోవద్దని సూచించారు. ప్రతి వ్యక్తి జీవితంలో ప్లస్, మైనస్ లు ఉంటాయని వాటిని అధిగమిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలే కానీ నావల్ల కాదని ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి తనువు తాలించడం సమస్యకు పరిష్కారం కాదని తెలిపారు. ప్రతి ఒక్కరికి వారి వారి స్థాయిని బట్టి సమస్యలు ఉంటాయని, ప్రపంచంలో సమస్యలు లేని మనిశులు ఉండరని, ప్రతికూల పరిస్థితిల్లో కూడా మనోధైర్యం కోల్పోకుండా ఉండాలని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శలు విజ్ఞప్తి మేరకు స్టడీ టూర్లు, వత్తిడి అధిగమించేందుకు మెడిటేషన్ వంటి కార్యక్రమాలు నిర్వహణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, డిపిఓ నారాయణరావు,
జడ్పి సీఈఓ విజయలక్ష్మి, డిఆర్డీఓ నరేష్, గ్రిడ్ ఈ ఈ మాణిక్యరావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి సంజీవరావు అన్ని మండలాల మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎపివోలు, పంచాయతి కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.