ఎస్టిపిపిలో ఉద్యోగులను బదిలీ చేయాలి
నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో గల ఎస్టిపిపి లో అనేక ప్రభుత్వ శాఖలలో ముఖ్యంగా సింగరేణి శాఖలో గత పది సంవత్సరాల కు పైబడి ఒకే దగ్గర ఒకే హోదాలో విధులు నిర్వహిస్తున్న అనేకమంది ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని కోరుతూ సింగరేణి సంస్థ చైర్మన్ బలరాం నాయక్ కి బిఏంఎస్ యూనియన్ తరపున యాదగిరి సత్తయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర అధ్యక్షులు సత్తయ్య మాట్లాడుతూ ఎస్టిపిపి లో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న అటెండర్ నుండి ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు ఎంతమంది ఉన్నా వారందరూ ఒకే సంస్థలో ఒకే దగ్గర ఒకే విధంగా విధులు నిర్వహిస్తున్న వారిని వెంటనే గుర్తించి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.గతంలో ఒకే దగ్గర పది సంవత్సరాల కు పైబడి విధులు నిర్వహిస్తున్న వారిని బదిలీ చేసే జీవో ఉందని ఆ జీవోను మళ్లీ సమీకరించి ఐదు సంవత్సరాలకు పైబడిన వారిని కూడా బదిలీ చేసే విధంగా ఒక కొత్త జీవోను తీసుకురావాలని బలరాం నాయక్ ని కోరారు.సంస్థలలో ఒకే దగ్గర విధులు నిర్వహించడం వల్ల సింగరేణి పవర్ ప్లాంట్ లో భూ నిర్వాసితులకు న్యాయం జరగడం లేదని తమ ఆవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో బిఎంఎస్ యూనియన్ నాయకులు బొగ్గు పరిశ్రమల ఇంచార్జ్ లక్ష్మారెడ్డి,ప్రధాన కార్యదర్శి దుస్సా భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.